పుష్ప ది రూల్ మూవీ ( Pushpa the rule movie )థియేటర్లలో విడుదలై 11 రోజులైనా ఈ సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు 550 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఈ కలెక్షన్లు షేర్ కలెక్షన్లు కాగా ఫుల్ రన్ లో ఈ సినిమా 650 కోట్ల రూపాయల ( 650 crore rupees )మార్క్ ను క్రాస్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
సెకండ్ వీకెండ్ లో సైతం ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఆదివారం రోజున రాజ్ పూర్ లోని థియేటర్ లో పుష్ప2 టికెట్ల కోసం క్యూ లైన్ పెరిగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
అల్లు అర్జున్ ( Allu Arjun )మూవీ మాస్ జాతరకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.బన్నీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

పుష్ప ది రూల్ హిందీ వెర్షన్ కలెక్షన్లు 250 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.పుష్ప ది రూల్ 2000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.బన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
మరోవైపు బన్నీ బెయిల్ రద్దు అవుతుందనే ప్రచారం జోరుగా జరుగుతుండటం గమనార్హం.

బన్నీ బెయిల్ క్యాన్సిల్ అయితే మాత్రం ఫ్యాన్స్ ఫీలయ్యే అవకాశం అయితే ఉంది.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ రావడానికి మరికొన్ని రోజుల సమయం పడే అవకాశం ఉంది.
బన్నీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.