సాధారణంగా కొందరి ముఖ చర్మం ఎంతో తెల్లగా, మృదువుగా, అందంగా కనిపిస్తుంది.కానీ శరీరం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.
అయితే ముఖ చర్మం పై పెట్టే శ్రద్ధ కొందరు బాడీ పై పెట్టరు.దాంతో మురికి, మృతకణాలు పేరుకుపోయి చర్మం నిర్జీవంగా మరియు కాంతి హీనంగా మారుతుంది.
అయితే అలాంటి వారు స్నానం చేయడానికి గంట ముందు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే బాడీ వైట్ గా మరియు బ్రైట్ గా మెరిసిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కీరదోసకాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.ఈ కీరా స్లైసెస్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మళ్లీ మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, అర కప్పు కీర దోసకాయ జ్యూస్, నాలుగు టేబుల్ స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బాడీ మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేయాలి.వారంలో నాలుగు సార్లు ఈ విధంగా కనుక చేస్తే చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
ముడతలు ఉంటే క్రమంగా దూరం అవుతాయి.మురికి మృత కణాలు తొలగిపోతాయి.
చర్మం టైట్ గా మారుతుంది.డ్రై స్కిన్ అన్న మాటే అనరు.
చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.బాడీ వైట్నింగ్ మరియు బ్రైట్నింగ్ కు ఈ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.