థైరాయిడ్‌దీర్ఘకాలికంగా వేధించే వ్యాధుల్లో ఇదీ ఒకటి.ఒక్క సారి థైరాయిడ్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది.
అయితే ఈ వ్యాధి బాధితుల్లో స్త్రీలే ఎక్కువగా ఉంటారు.దాంతో స్త్రీలకు మాత్రమే థైరాయిడ్ వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు.
కానీ, అది నిజం కాదు.మగవారు కూడా థైరాయిడ్ బారిన పడుతుంటారు.
మరి ఈ వ్యాధిని ఎలా గురించాలి.? అసలు థైరాయిడ్ వస్తే మగవారిలో కనిపించే లక్షణాలు ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా, డైట్‌లు ఫాలో అవ్వకపోయినా బరువు తగ్గుతూ ఉంటే ఖచ్చితంగా అనుమానించాలి.
ఎందుకంటే, ఉన్నట్టు ఉండి బరువు తగ్గడం అనేది థైరాయిడ్ వ్యాధి లక్షణాల్లో ఒకటి.
గుండె దడ, గొంతు బొంగురు పోవడం, ఛాతీ నొప్పి వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక ఉత్పత్తి వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి.
అలాగే గొంతు వాపు, మెడ భాగం గట్టి పడటం వంటివి కూడా థైరాయిడ్ వ్యాధి లక్షణాలే.
ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది.
థైరాయిడ్ బారిన పడ్డ మగవారిలో కనిపించే మరో లక్షణం లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం.థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం లేదా తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇలా జరుగుతుంది.
థైరాయిడ్ వ్యధి ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా నెమ్మదిస్తుంది.
దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.ఇలా మీకూ జరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించడమే ఉత్తమం.
ఇక ఇవే కాకుండా చర్మం పొడి బారడం, హెయిర్ ఫాల్, అతి నిద్ర, నీరసం, అలసట, ఒత్తిడి, చికాకు, అధిక చెమటలు, కండరాల నొప్పి, ఆలోచనా శక్తి మందగించడం ఇవన్నీ కూడా థైరాయిడ్ వ్యాధి లక్షణాలే.ఇటువంటి లక్షణాలను అశ్రద్ద చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.