ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.44
సూర్యాస్తమయం: సాయంత్రం.6.18
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.11.38 మ12.14 సా4.38 ల5.28
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:

ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.
వృషభం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది.చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది.
నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.
మిథునం:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.
కర్కాటకం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది.గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది.వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పొందుతారు.
సింహం:

ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు.ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
కన్య:

ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.
తుల:

ఈరోజు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి.కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
వృశ్చికం:

ఈరోజు ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది.ఇంట బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలలలో ఆలోచనలు కలసి రావు.ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.
ధనుస్సు:

ఈరోజు జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
మకరం:

ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కుంభం:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి.
నిరుద్యోగులకు నిరాశ తప్పదు.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లభించవు.
మీనం:

ఈరోజు ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు.పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.