సాధారణంగా కొందరి స్కిన్ ఎప్పుడూ డల్‌గా, నిర్జీవంగా ఉంటుంది.ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, మద్యపానం, కెమికల్స్ ఎక్కువగా ఉండే కాస్మొటిక్స్ వాడకం, కాలుష్యం ఇలా రకరకాల కారణాల వల్ల స్కిన్ డల్‌గా అయిపోతుంది.ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల క్రీములు వాడతారు.
తరచూ బ్యూటీ పార్లర్స్ వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే.
సులువగా డల్‌గా ఉండే చర్మాన్ని నిగారింపుగా మార్చుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు, చందనం పొడి మరియు కస్తూరి పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమానికి చర్మానికి అప్లే చేసి.
అరగంట పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.చర్మం నిగారింపుగా మారుతుంది.
అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ తేనె వేసి కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమానికి చర్మానికి పూతలా వేసి.
పది లేదా ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.ఆనంతరం కూల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి.
ఇలా చేసినా డల్‌గా ఉంటే స్కిన్ గ్లోగా మరియు అందంగా మారుతుంది.
ఇక ఈ చిట్కాలతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.అలాగే కొబ్బరి నీళ్లు, సబ్బా నీరు, మజ్జిగ వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి.రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించాలి.
డైలీ డైట్‌లో ఏదో ఒక పండు ఉండేలా చూసుకోవాలి.కాస్మొటిక్స్ అధికంగా వాడటం తగ్గించాలి.
మద్యపానం ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.అప్పుడే చర్మం నిగారింపుగా మారుతుంది.