వరలక్ష్మీ రూపాలెన్నో తెలుసా? ఆ తల్లిని పూజిస్తే ఏం వస్తుంది?

వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం కల్గుతాయట.సృష్టిలోని ప్రతీ ఒక్కరూ కోరుకునేవి, కోరుకోదగినవి ఈ మూడేనని పెద్దలు చెబుతున్నారు.

 Whats Is The Use Of We Do Varalaxmi Puja, Varalaxmi Puja , Devotional , Lakshmi-TeluguStop.com

ఈ కోరదగిన అంశాలను వరం అంటారు.జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ మూడింటి స్వరూపమైన దేవతా శక్తి వరలక్ష్మీ.

అయితే మనిషి సుఖ సంతోషాలతో బతకడానికి కావాల్సినవి ఈ మూడే.ఈ మూడూ ఉంటే ఎలాంటి భయాలు లేకుండా ప్రతీ మనిషి సుఖంగా జీవిస్తాడు.

అయితే ఈ మూడింటి గురించి మనం కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం.

ఈ మూడు వరాల్లో మొదటిది జ్ఞానం.

ఇది ప్రథమమే కాక ప్రధామని మన పెద్దలు చెబుతుంటారు.మనిషికి జ్ఞానం ఉంటే కోరుకున్నవన్నీ సాధించుకోగల్గుతాడు.

అందుకే తెలివైన భక్తులు డబ్బు, సుఖాలను కాకుండా జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ అమ్మవారిని కోరుకుంటారు.అయితే రెండోది ఐశ్వర్యం.

ఇందు కోసం మనం ప్రత్యేకంగా కోరుకోవాల్సిన పనేమి లేదు.ఎందుకంటే జ్ఞానం ఉంటే ఇది దానంతట అదే వస్తుంది.

అలాగే ఆనందం కూడా.అయితే పై రెండూ ఉంటే మనిషికి ఆనందం కచ్చితంగా ఉంటుంది.

అయితే పరిశుభ్రమైన మనసు, వాతావరణంలో ఉండి… ఆ స్వచ్ఛమైన మనసు గల అమ్మవారిని పూజిస్తే.అంతా మంచే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఎవరికీ ఎటువంటి హానీ చేయకుండా ప్రశాంతంగా బతికితే ఆ లక్ష్మీ దేవి అమ్మవారి కటాక్షం మనపై కచ్చితంగా ఉంటుందట.అందుకే ఎవరి మనసును నొప్పించకుండా.

మన పని మనం చేసుకుంటూ వెళ్తే.ఆ తల్లి కృప మనపై కచ్చితంగా ఉంటుంది.

వీలయినంత వరకు ఒంటితో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.శుచి, శుభ్రత ఉన్న చోటే లక్ష్మీ దేవి ఉంటుందట.

అందుకే రోజూ దీపారాధన చేస్తూ.ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

అప్పుడే ఆ వరలక్షీ వారు మన ఇంటికి వస్తారు.

Whats Is The Use Of We Do Varalaxmi Puja, Varalaxmi Puja , Devotional , Lakshmi Devi - Telugu Devotional, Laxmidevi, Mahalaxmi, Varalaxmi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube