దేశంలో నిరుద్యోగం ఎంతగా తాండవం చేస్తోందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే, అందులో మనమూ ఒకరం కాబట్టి.
అయితే ఈ క్రమంలోనే నిరుద్యోగుల ఉత్సుకతను క్యాష్ చేసుకొనే కేటుగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది ఇక్కడ డబ్బులు చేసుకుంటున్నారు.
మన సౌత్ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి వున్న డిమాండ్ అంతాఇంతా కాదు.ఎంత డిమాండ్ అంటే ఇక్కడ ప్రభుత్వ వుద్యోగం లేకపోతే యువకులకు పెళ్లికాని పరిస్థితి.
అవును, అందువల్లనే నిరుద్యోగులు అనామకులు చెప్పిన విషయాలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు.అయితే ఇందులో IT, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్ధులు కూడా ఉండడం గమనార్హం.
తాజాగా తమిళనాడులో రైల్వే ఉద్యోగాల పేరుతో 28 మంది దారుణంగా మోసపోయిన సంఘటన వెలుగు చూసింది.రైల్వే వుద్యోగం ఇప్పిస్తామని, స్టేషనులో వచ్చీ పోయే రైళ్లు, వాటి బోగీలను లెక్కించడమే మీ ఉద్యోగం అని చెప్పి వారిని బురిడీ కొట్టించారు.
అయితే వుద్యోగం కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న వారికి వారు చెప్పే విషయం మీద ఏ మాత్రం అనుమానం రాలేదట.

ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే, ఆ సో కాల్డ్ నిరుద్యోగులు నెల రోజులు పని చేయడం.ఆ తర్వాత జీతం కోసం వెయిట్ చేయగా, అది రాకపోవడంతో అప్పుడు వారికి అస్సలు విషయం బోధపడిందట.ఆ యువకులు దాదాపు 24 లక్షల రూపాయిలు కేటుగాళ్లైన రాణా, శివరామన్ లకు ముట్ట జెప్పారు.
వీరిలో రాణా తనను తాను ఢిల్లీలోని నార్త్ రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ గా పరిచయం చేసుకోగా మిగిలినవాడు రైల్వేలో అకౌంటెంట్ అని చెప్పుకున్నాడట.కాగా వారు ఆ నెలరోజులు డ్యూటీ చేసిన స్టేషన్ ఏదంటే ఢిల్లీ రైల్వే స్టేషన్.
అందుకే ఇలాంటి బ్యాక్ డోర్ ఉద్యోగాల పట్ల జాగ్రత్తగా వుండాలిరా బాబులూ!
.







