టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిసిన విశాల్ ప్రస్తుతం సరైన హిట్ లేక ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు.గతంలో పలువురితో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన విశాల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 6వ తేదీన విశాల్ మక్కల్ నల ఇయక్కం ఛారిటబుల్ ట్రస్ట్ సహాయంతో 11 ప్రేమ జంటలకు సహాయం చేసిన విశాల్ పేద జంటలకు సంబంధించి పెళ్లి ఖర్చులను భరించాడు.
పేద జంటలకు విశాల్ తాళిబొట్టులతో పాటు వాళ్లకు అవసరమైన 51 ముఖ్యమైన వస్తువులను అందజేయడం గమనార్హం.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విశాల్ ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నామని మూడు సంవత్సరాలలో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.ఈ భవన నిర్మాణం పూర్తైన వెంటనే పెళ్లి చేసుకుంటానని విశాల్ కామెంట్లు చేశారు.
లవ్ చేసిన అమ్మాయితో ఏడడుగులు వేస్తానని విశాల్ పేర్కొన్నారు.
అరేంజ్డ్ మ్యారేజ్ నాకు సెట్ కాదని విశాల్ చెప్పుకొచ్చారు.

నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందని విశాల్ కామెంట్ చేశారు.నేను ప్రేమించిన అమ్మాయిని అతి త్వరలో పరిచయం చేస్తానని విశాల్ కామెంట్లు చేశారు.విశాల్ గతంలో ఒక నటితో ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.విశాల్ కు గతంలో ఒక నటితో నిశ్చితార్థం జరిగిందనే సంగతి తెలిసిందే.

అయితే నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల అనంతరం వేర్వేరు కారణాల వల్ల ఆ నిశ్చితార్థం బ్రేక్ అయింది.విశాల్ ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.విశాల్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విశాల్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.