టాలీవుడ్ హీరో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన తాజా చిత్రం తండేల్.చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇప్పటికే వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు.

అలాగే సాయి పల్లవి తన డాన్స్ తో మెప్పించింది.తాజాగా సాయి పల్లవితో కలిసి డ్యాన్స్ చేయడం గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాయి పల్లవితో కలిసి సీన్ చేయాలన్నా, డ్యాన్స్ వేయాలన్నా తనకు ఎక్కడ లేని టెన్షన్ వస్తుందది.ఒక రకంగా నా డ్యాన్స్ ఇంప్రూవ్ అవడానికి కారణం పల్లవి అనే చెప్పవచ్చు అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
ప్రతీ సన్నివేశం పూర్తవగానే వెంటనే మానిటర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సీన్ బాగా వచ్చిందో లేదో చూసి బాలేకపోతే మరోసారి రీటేక్ చేద్దామంటుంది.

ఆమె లాంటి హీరోయిన్ ను నేనెప్పుడూ చూడలేదు.సాయి పల్లవికి వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉందని నాగ చైతన్య తెలిపారు.ఇందుకు సంబంధించిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్థాయి పల్లవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అది కదా మా సాయి పల్లవి అంటే, నటనకు కేర్ ఆఫ్ అడ్రస్,డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.కాగా సాయి పల్లవిని అభిమానులు ముద్దుగా లేడి పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.