స్వీడన్‌లో అన్నామలై రామనాథన్, మీనా పళనియప్పన్(Annamalai Ramanathan, Meena Palaniappan) అనే భారతీయ సంతతికి చెందిన కపుల్స్ నివసిస్తున్నారు.అయితే ఈ ఎన్నారై జంట తమ సంపాదనలో దాదాపు 50% పన్నులు కడుతున్నారట.
అయినా సరే, వాళ్లు ఏ మాత్రం బాధపడట్లేదు.కారణం స్వీడన్ దేశంలో ఉన్న అదిరిపోయే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు.
ఇవే వాళ్లని హ్యాపీగా ఉంచుతున్నాయి.
రామనాథన్(Ramanathan) ఒక ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీర్, పళనియప్పన్(Palaniappan) ఫైనాన్స్ ప్రొఫెషనల్.
వీళ్లిద్దరూ తమ చిన్న కొడుకుతో కలిసి స్వీడన్‌లో నివసిస్తున్నారు.ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ కంపెనీ వాళ్ల జీతంలో 31.4% సోషల్ సెక్యూరిటీ కోసం కంట్రిబ్యూట్ చేస్తుంది.మిగిలిన జీతంపై వీళ్లు 25% ఆదాయపు పన్ను కడతారు.అంటే మొత్తం జీతంలో 17.15% పన్నులకే పోతుంది.అన్ని పన్నులూ పోగా, చివరకు వాళ్ల చేతికి వచ్చేది దాదాపు 51% మాత్రమే.

అయినా స్వీడన్ (Sweden)ప్రభుత్వం ప్రజలకు చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుంది.దీంతో వీళ్లకి పెద్దగా డబ్బులు దాచుకోవాల్సిన అవసరం ఉండదు.పిల్లల చదువులకు, ఆరోగ్యానికి పైసా ఖర్చు లేదు.అంతేకాదు, ప్రతీ నెలా గవర్నమెంట్ వాళ్ల అకౌంట్లో 1,250 స్వీడిష్ క్రోనా (Swedish Krona)(దాదాపు రూ.10,000) చైల్డ్ అలవెన్స్‌గా వేస్తుంది.రిటైర్మెంట్ తర్వాత స్టేట్ పెన్షన్ వస్తుంది.పెద్దయ్యాక ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగ భృతి.ఒకవేళ ఉద్యోగం పోతే, ప్రభుత్వం వాళ్లు ఇంతకుముందు తీసుకున్న జీతంలో 100% ఇస్తుంది.
ఈ భరోసా ఉండటం వల్లనే వీళ్లు పెద్దగా సేవింగ్స్ చేయాల్సిన అవసరం లేకుండా హాయిగా ఉంటున్నారు.ఎమర్జెన్సీ ఫండ్ కింద కేవలం 50,000 స్వీడిష్ క్రోనాలు మాత్రమే పెట్టుకున్నారు.అది కూడా ఇండియాకి ఫ్లైట్ టికెట్స్ కోసమేనట

స్వీడన్‌లో కొన్ని ఖర్చులు చాలా ఎక్కువగానే ఉంటాయి.బయట తినాలంటే, పర్సనల్ సర్వీసులు కావాలంటే, ఇండియాకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే.ఇల్లు కొనడం కూడా చాలా కష్టం.వడ్డీ రేట్లు 3-3.5% ఉన్నా సరే ఇళ్ల ధరలు మండిపోతాయి.అందుకే చాలామంది రెసిడెంట్ అసోసియేషన్ ద్వారా అపార్ట్‌మెంట్‌లను కొనుక్కుంటారు.
ఏది ఏమైనా, రామనాథన్, పళనియప్పన్ మాత్రం పన్నుల గురించి అస్సలు టెన్షన్ పడట్లేదు.స్వీడన్ దేశం బలమైన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్లకి ప్రశాంతమైన జీవితాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తోంది.
అందుకే వాళ్లు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.







