పని చేసే చోట ఆడవాళ్లకు ఎంత కష్టం ఉంటుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.ముఖ్యంగా గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్లకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనకు తెలుసు.
అలాంటి సమయంలో ఒక కంపెనీ ఓ ఉద్యోగినిని తీవ్రంగా వేధించింది.చివరకు ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లి తన హక్కుల్ని గెలుచుకుంది.
వివరాల్లోకి వెళ్తే, పౌలా మిలుస్కా(Paula Miluska) అనే ఆమె బిర్మింగ్‌హామ్(Birmingham) లో ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్ గా పనిచేసేది.రోమన్ ప్రాపర్టీ గ్రూప్ లిమిటెడ్(Roman Property Group Limited) అనే కంపెనీలో జాబ్ చేసేది.2022, అక్టోబర్ నెలలో తను గర్భవతి అని తెలిసింది.దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ నవంబర్ వచ్చేసరికి అసలు సమస్య మొదలైంది.
పౌలాకు మార్నింగ్ సిక్నెస్ బాగా ఎక్కువైపోయింది.వాంతులు, నీరసంతో ఆఫీసుకు వెళ్లడం కూడా కష్టమైంది.డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు.దాంతో ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్(Work from home) చేసుకోవడానికి పర్మిషన్ అడిగింది.
తన బాస్ పేరు అమ్మర్ కబీర్.అతనికి మెసేజ్ పెట్టింది.“నాకు మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంది.మిడ్ వైఫ్ కూడా ఇంటి నుంచే పని చేయమని చెప్పారు.ఆఫీసుకు రావాలంటే హెల్త్ అండ్ సేఫ్టీ అసెస్‌మెంట్ కూడా చేయాలి.” అని అడిగింది.
కానీ ఆ బాస్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు.నవంబర్‌లో మెసేజ్ పెడితే 26వ తేదీ వరకు కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు.ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు.“ఎలా ఉన్నావ్?” అని అడిగాడు.మళ్లీ నెక్స్ట్ డే ఇంకో టెక్స్ట్ మెసేజ్.“వచ్చే వారం కొన్ని రోజులు ఆఫీసుకు రా.సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తే చాలు” అని చెప్పాడు.

పౌలా వెంటనే రిప్లై ఇచ్చింది.“నేను చాలా నీరసంగా ఉన్నాను.పనిచేసే ఓపిక లేదు.
ఈ రోజు ఒక్కరోజే ఆరుసార్లు వాంతులు అయ్యాయి.హాస్పిటల్ లో చేరాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది.
సారీ నేను ఆఫీసుకు రాలేనందుకు” అని మెసేజ్ పెట్టింది.కానీ అమ్మర్ కబీర్ మళ్లీ సైలెంట్ అయిపోయాడు.
డిసెంబర్ 1 వరకు ఎలాంటి రిప్లై లేదు.
డిసెంబర్ 1న మాత్రం ఒక వింత మెసేజ్ పెట్టాడు కబీర్.“కంపెనీ చాలా కష్టాల్లో ఉంది.ఆఫీసుకు వచ్చి పనిచేసేవాళ్లు కావాలి.
నువ్వు పర్సనల్ గా తీసుకోకు” అని మెసేజ్ పెట్టాడు.చివర్లో ఒక జాజ్ హ్యాండ్స్ ఎమోజీ కూడా పెట్టాడు.
(🤌 ఈ ఎమోజీ).అంటే పౌలాను ఉద్యోగం నుంచి తీసేశాడని ఆమెకు అర్థమైపోయింది.
డిసెంబర్ 1 నుంచి జీతం కూడా ఆగిపోయింది.

అంతే, పౌలా ఊరుకోలేదు.లీగల్ యాక్షన్ తీసుకుంది.అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేశారని, గర్భవతి అని తెలిసి వివక్ష చూపించారని కోర్టులో కేసు వేసింది.
బర్మింగ్‌హామ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ లో కేసు విచారణ జరిగింది.కబీర్ మాత్రం కోర్టులో “నేను ఆమెను ఉద్యోగం నుంచి తీసేయాలని అనుకోలేదు” అని చెప్పాడు.
కానీ జడ్జి గ్యారీ స్మార్ట్ మాత్రం పౌలా వాదంతో ఏకీభవించారు.ఆమెను అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేశారని తేల్చారు.
అంతేకాదు ఆమెకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కూడా ఆర్డర్ వేశారు.
చివరికి పౌలా మిలుస్కా ఏకంగా 93 వేల పౌండ్లు (దాదాపు 1 కోటి రూపాయలు) పరిహారం గెలుచుకుంది.
మార్నింగ్ సిక్నెస్ (Morning sickness)వస్తే ఉద్యోగం నుంచి తీసేస్తే ఊరుకునే రోజులు పోయాయని ఈ తీర్పుతో అర్థమవుతోంది.ఆడవాళ్లు తమ హక్కుల కోసం పోరాడితే విజయం సాధించగలరని పౌలా రుజువు చేసింది.