Cough Home Remedies : మీ చిన్నారులకు దగ్గు సమస్య వేధిస్తూ ఉందా.. అయితే ఈ హోం రెమిడీతో తరిమికొట్టండి..!

ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రజలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.వీటన్నిటికీ ముఖ్య కారణం పొల్యూషన్ మరియు తినే ఆహారమే అని నిపుణులు చెబుతున్నారు.

 Best Home Remedies And Precautions To Get Relief From Cough In Children-TeluguStop.com

మన శరీరానికి అందించే ప్రతిదీ కూడా ప్రస్తుత సమాజంలో కల్తీగా ఉంది.మనం తీసుకునే ప్రతి ఆహారం ప్రస్తుత సమాజంలో కల్తీ అవుతోంది.

కల్తీ ఆహారాల వలన పిల్ల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.అందులో కొన్ని సమస్యలు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి.

ఇక చిన్న పిల్లలకు( Children ) అయితే ఫుడ్ పాయిజన్, వైరల్ ఫీవర్ లాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

Telugu Ajwain, Cough, Honey, Pepper Milk, Vapor-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే అటువంటి అనారోగ్య సమస్యలలో దగ్గు( Cough ) ముఖ్యమైన సమస్య అని నిపుణులు చెబుతున్నారు.చిన్న పిల్లలలో ప్రస్తుతం దగ్గు సమస్య ఎక్కువగా ఉంది.ఇక ఈ దగ్గు సమస్యను ఇంటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే చిన్న పిల్లలకు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి పట్టించాలి.అదేవిధంగా తేనెలోని( Honey ) యాంటీ ఆక్సిడెంట్లు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

వాము( Ajwain ) వేడి నీటిలో వేసి మరిగించిన తర్వాత ఆ నీటిని మీ పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా దగ్గు సమస్య దూరం అవుతుంది.ఇక పిల్లల చెస్ట్ మరియు నెక్ ప్రాంతాలలో మసాజ్ చేయడం ఎంతో ముఖ్యం.

Telugu Ajwain, Cough, Honey, Pepper Milk, Vapor-Telugu Health

అలాగే తరచుగా నీళ్లను తాగిస్తూ ఉండాలి.ఇది శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.అదేవిధంగా మిరియాల పాలను( Pepper Milk ) తాగించడం వల్ల దగ్గు సమస్య దూరం అవుతుంది.అంతేకాకుండా రొంప వ్యాధి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఇక పైన చెప్పిన చిట్కాలను పాటించి మీ పిల్లలను దగ్గు నుంచి దూరం చేయవచ్చు.ఇక దీంతో ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే సహజ పద్ధతిలో దగ్గును దూరం చేసుకోవచ్చు.

అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube