కొబ్బరి పాలు వర్సెస్ గేదె పాలు.. ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్టో తెలుసా?

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యం పాలును( Milk ) వాడుతుంటారు.ముఖ్యంగా చాలా మంది గేదె పాలు( Buffalo Milk ) తాగుతుంటారు.

 Coconut Milk And Buffalo Milk Which Is Better Details, Coconut Milk, Buffalo Mi-TeluguStop.com

జంతువు పాలు ఇష్టం లేనివారు ప్రత్యామ్నాయంగా ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఎంచుకుంటారు.ఇందులో భాగంగానే ఇటీవల కొందరు కొబ్బరి పాలకు( Coconut Milk ) అలవాటు ప‌డుతున్నారు.

కొబ్బరితో ఇంట్లోనే పాలు తయారు చేసుకుని తీసుకుంటున్నారు.అస‌లింత‌కీ కొబ్బరి పాలు, గేదె పాలు.

ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అని అడిగితే నిపుణులు కొబ్బరి పాలే అని చెబుతున్నారు.

గేదె పాలలో కొలెస్ట్రాల్( Cholestrol ) ఎక్కువగా ఉంటుంది.

కానీ కొబ్బరి పాలలో జీరో కొలెస్ట్రాల్. అలాగే గేదె పాలతో పోలిస్తే కొబ్బరి పాలల్లోనే ఎక్కువ క్యాలరీల శక్తి ఉంటుంది.

ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, డైటరీ ఫైబర్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు కొబ్బ‌రి పాల‌ల్లో నిండి ఉంటాయి.గేదె పాలకు బదులుగా కొబ్బరి పాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Telugu Buffalo Milk, Buffalomilk, Coconut Milk, Coconutmilk, Tips, Latest, Milk-

ముఖ్యంగా తెలివితేటలను, మేధాశక్తిని పెంచడానికి కొబ్బరిపాలు అద్భుతంగా తోడ్పడతాయి.కొబ్బరిపాలను నిత్యం తీసుకుంటే మతిమరుపు( Memory Loss ) రాకుండా ఉంటుంది.బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది.అలాగే గేదె పాలు తాగితే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.కానీ కొబ్బరి పాలతో ఆ టెన్షన్ అక్కర్లేదు.రోజుకు ఒక గ్లాస్ కొబ్బరి పాలు తాగితే మెటబాలిజం( Metabolism ) చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.

ఫలితంగా మీ బాడీ వెయిట్ మీ కంట్రోల్ లోకి వస్తుంది.

Telugu Buffalo Milk, Buffalomilk, Coconut Milk, Coconutmilk, Tips, Latest, Milk-

రక్తహీనతతో బాధపడుతున్న వారికి గేదె పాలు కంటే కొబ్బరి పాలు శ్రేష్టకరం.కొబ్బరి పాలలో ఐరన్ మెండుగా ఉంటుంది అందువల్ల నిత్యం కొబ్బరి పాలు తాగితే రక్తహీనత దూరం అవుతుంది.అంతేకాదు కొబ్బరిపాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.

పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.మరియు స్కిన్ హెల్తీగా, షైనీ గా మెరుస్తుంది.

జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube