తెలుగు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ (socail media) ఒకరు.ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను అందించింది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Junior NTR Prashanth Neel)కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్నట్టు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో ఒక పోస్టర్ కూడా విడుదలైంది.
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City)లో మొదలు కానుందని సమాచారం అందుతుంది.జూనియర్ ఎన్టీఆర్(Jr, Ntr) ప్రస్తుతం వార్ 2 (War 2)మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తారక్ లేని సన్నివేశాలను మొదట చిత్రీకరించనున్నారని సమాచారం అందుతోంది.
దాదాపుగా పది రోజులపాటు ఈ షెడ్యూల్ జరగనుంది.

తాజా షెడ్యూల్లో ఏకంగా 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారని బోగట్ట.మహారాష్ట్ర కోల్కతా బ్యాక్ డ్రాప్ లలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.ఎన్టీఆర్ కి జోడిగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
తారక్ రుక్మిణి జోడి బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.దాదాపుగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మార్చి నెల మొదటివారం నుంచి తారక్ ఈ సినిమా రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.మే నెల 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.2026 సంవత్సరం జనవరి 9వ తేదీ టార్గెట్గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేశారని తెలుస్తోంది.