జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ (Jabardast comedian Dhanraj)గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్(Jabardast) లో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ధనరాజ్.
జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించే విషయం తెలిసిందే.సినిమాలలో కూడా తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇకపోతే ఇప్పుడు దర్శకుడిగా మారి రామం రాఘవం (Rama Raghavam)అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు ధనరాజ్.ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ధనరాజ్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ధనరాజ్(Dhanraj) వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ.నాకు సినిమాల్లో ఇంకా అవకాశాలు రాకముందే నాన్న చనిపోయారు.
సినిమాల కోసం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను.చాంచులు వెతుక్కుంటూ హైదరాబాదులో ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేస్తుంటే మా ఊరి వ్యక్తి చూసి వెళ్లి మా అమ్మకు చెబితే మా అమ్మ బాగా ఏడ్చింది.
అలా తర్వాత నాకోసం మా అమ్మ ఇక్కడే ఉండిపోయింది.నా కోసం ఇక్కడికి వచ్చేసాక మా అమ్మ అపోలో హాస్పిటల్ లో ఆయాగా పనిచేసేది.
నేను ఇంకా ఛాన్సులు వెతుక్కుంటూ ఉండేవాడిని.

కొన్ని రోజులు మా అమ్మే నన్ను పోషించింది.బ్యాక్ గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేశాను.కానీ నా మొదటి సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన జై.2004 లో నా మొదటి సినిమా జై రిలీజ్ అయింది.ఆ సినిమాకు మా అమ్మను తీసుకెళ్ళాను.
టోలి చౌక్ గెలాక్సీ థియేటర్ లో సినిమా చూసాము.ఆ సినిమాలో నన్ను పొడిచే సీన్ ఉంటుంది.
అది నిజమే అనుకోని నీకేమన్నా అయిందా, నిజంగా పొడిచారా, ఏది చూపించు అని సినిమా అయిపోయి ఇంటికొచ్చేదాకా ఎమోషనల్ అయింది అని తెలిపాడు.అప్పటికే మా అమ్మ క్యాన్సర్ నాలుగవ స్టేజిలో ఉంది.
అంతకు ముందు నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.నా మొదటి సినిమా జై చూసిన కొన్ని రోజులకే అమ్మ క్యానర్ తో చనిపోయింది.
నేను నటించిన మొదటి సినిమా అమ్మ చూసిన చివరి సినిమాగా మిగిలింది అంటూ ఎమోషనల్ అయ్యాడు ధనరాజ్.అయితే వాళ్ళ అమ్మ చివరి దశలో ఉన్నప్పుడే తన భార్య శిరీష పరిచయం అయిందని, ఆ సమయంలో తనకు బాగా సపోర్ట్ గా నిలిచిందని, అమ్మ చనిపోయాక అమ్మలా నా జీవితంలోకి వచ్చిందని తన భార్య గురించి కూడా చెప్పాడు.
ఈ సందర్భంగా ధనరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.