ఓరి నాయనో, 30 నిమిషాల్లో నెల జీతం గోవిందా.. ఏం కొన్నాడో తెలిస్తే షాక్!

చాలా మంది నెలంతా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బును ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెడతారు.రూపాయి రూపాయి లెక్క చూసుకుంటూ భవిష్యత్తు కోసం దాచుకుంటూ ఉంటారు.

 Shocked To Know What Govinda Bought A Month's Salary In 30 Minutes, Luxury Shopp-TeluguStop.com

కానీ కొందరైతే ఆ డబ్బును నీళ్లలా వృథా చేస్తారు.జేబులో డబ్బులుంటే చాలు.

ఏది కనబడితే అది కొనేస్తూ.జీతం రాగానే కొద్ది రోజుల్లోనే అదంతా ఖాళీ చేసేస్తారు.

ఇలాంటి వాళ్ళను మించేలా ఒక వ్యక్తి ఉన్నాడు.అతను మాత్రం జీతం చేతికి రాగానే జస్ట్ 30 నిమిషాల్లోనే బూడిద చేస్తాడట.

బూడిద చేస్తాడంటే, క్షణాల్లో మొత్తం మాయం చేస్తాడు.వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఒక రెడిట్‌ యూజర్ తన ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్లినప్పుడు జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి చెప్పాడు.

ఆ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నాడట.వీళ్లిద్దరూ కలిసి ఎల్లాంటే మాల్‌లోని ‘డా మిలానో’ ( Da Milano )షోరూమ్‌కి వెళ్లారు.

డా మిలానో అంటే లగ్జరీ ఇటాలియన్ లెదర్ ప్రోడక్ట్స్‌కి ఫేమస్.

అక్కడ తన ఫ్రెండ్ అస్సలు ఆలోచించకుండా రెండు జతల ‘రోసో బ్రునెల్లో’ ( Rosso Brunello )షూస్‌ని రూ.28,000 పెట్టి కొనేశాడు.అంతే కాదు, ఆ తర్వాత వెంటనే రూ.9,800 పెట్టి 60ml ‘వైవ్స్ సెయింట్ లారెంట్’ ( Yves Saint Laurent )పెర్ఫ్యూమ్, ఇంకో రూ.3,400 పెట్టి ఫేస్‌వాష్ కూడా కొన్నాడు.అన్నీ కలిపి ఒకేసారి కొనేశాడు, ధర ఎంత అని అడగలేదు, బేరం చేయలేదు.అది చూసి సదరు రెడిట్‌ యూజర్ షాక్ అయ్యాడు.“అతను జస్ట్ వస్తువుల్ని చూశాడు, ప్యాక్ చేయమన్నాడు, కార్డు స్వైప్ చేశాడు, బ్యాగులు పట్టుకుని బయటికి వచ్చేశాడు” అని రాసుకొచ్చాడు.దాంతో అతనికి తన ఫైనాన్షియల్ స్టేటస్ గుర్తొచ్చింది.

“మా పేరెంట్స్ నాకు బాగానే ఇచ్చారు.కానీ నా ఫ్రెండ్ అంత డబ్బున్న వాడిని చూశాక, నాకు మైండ్ బ్లాంక్ అయింది.

నేనెప్పుడూ ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనగలిగేంత డబ్బు సంపాదించాలని ఉంది” అని తన మనసులో మాట చెప్పాడు.ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయిపోయింది.

డబ్బున్న వాళ్ల లైఫ్‌స్టైల్స్, ఫైనాన్షియల్ ప్రివిలేజ్ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఒక యూజర్ కామెంట్ చేస్తూ, “నాకు కూడా ఇలాంటి ఫీలింగ్ వచ్చింది.మా బంధువు ఒకాయన లండన్‌లో( London ) షాపింగ్ చేస్తాడు, అక్కడ తక్కువ ధరలకి దొరుకుతాయంట.కానీ నాతో పోలిస్తే చాలా తక్కువ ప్రివిలేజ్ ఉన్న వాళ్లని కూడా నేను చూశాను.

అది చూస్తే నాకు గ్రేట్‌ఫుల్‌గా అనిపిస్తుంది, ఇంకా కష్టపడి పనిచేయాలనిపిస్తుంది” అన్నాడు.

మరో యూజర్, “నాకు అంత డబ్బున్నా నేను ఇంత ఖరీదైన వస్తువుల మీద పెట్టను.ఒక పెర్ఫ్యూమ్, ఒక బ్యాగ్, ఒక జత షూస్, ఒక బెల్ట్ అంతే నాకు చాలు” అని కామెంట్ చేశాడు.ఇంకొక నెటిజన్, “అది వాళ్ల లైఫ్‌స్టైల్ అంతే.నేను నా రూ.250 ఫేస్‌వాష్‌తో హ్యాపీగా ఉన్నాను.పెర్ఫ్యూమ్ కొనొచ్చు కానీ, నేను ఇంకా సంపాదించట్లేదు కాబట్టి నేనేం చెప్పలేను” అని రాసుకొచ్చాడు.ఈ పోస్ట్ చూస్తే, ఒక్కొక్కరూ వాళ్ల బ్యాక్‌గ్రౌండ్, పెరిగిన విధానాన్ని బట్టి డబ్బుని ఎలా చూస్తారో అర్థమవుతుంది.

https://www.reddit.com/r/Chandigarh/comments/1iphce1/a_months_salary_spend_in_30_minutes/?utm_source=share&utm_medium=mweb3x&utm_name=mweb3xcss&utm_term=1&utm_content=share_button
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube