ఇస్లాం అరబ్బుల మతం, భారత్‌లో అందరూ హిందువులే.. ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు!

మధ్యప్రదేశ్ క్యాడర్‌కు( Madhya Pradesh Cadre ) చెందిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్( Niaz Khan ) చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.ఆయన ఏకంగా “ఇస్లాం అనేది అరబ్బుల మతం, భారతదేశంలో అందరూ ఒకప్పుడు హిందువులే” అని కుండబద్దలు కొట్టారు.ఫిబ్రవరి 16న ఆదివారం నాడు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.”ఇస్లాం అరబ్బుల మతం.ఇండియాలో ఒకప్పుడు అందరూ హిందువులే.ఆ తర్వాత చాలామంది ఇస్లాంలోకి మారారు.

 Islam Is The Religion Of The Arabs, All Hindus In India, Ias Officer's Sensation-TeluguStop.com

మతం వేరైనా మన రక్తం ఒక్కటే.మన సంస్కృతి ఒక్కటే.

అరబ్బులే ఆదర్శం అనుకునే ముస్లింలు ఒక్కసారి ఆలోచించాలి.ముందు హిందువుల్ని మీ సోదరులుగా చూడండి, తర్వాత అరబ్బుల్ని చూడండి” అని నియాజ్ ఖాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో ( ANI )నియాజ్ ఖాన్ మాట్లాడుతూ.తాను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందో వివరించారు.హిందూ-ముస్లిం గొడవల గురించి తరచూ వార్తలు చదువుతున్నానని, అందరూ ఒకే మూలం నుంచి వచ్చారని ప్రజలు తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.విభజనకు అసలు కారణమే లేదని ఆయన స్పష్టం చేశారు.”భారతదేశం ఎప్పుడూ హిందూ మెజారిటీ దేశం.విదేశీ పాలకులు వచ్చారు, మతమార్పిడులు జరిగాయి, ఆ తర్వాత ఇస్లాం, క్రైస్తవ్యం, ఇతర మతాలు వ్యాపించాయి.

కానీ నిజానికి మనమంతా ఒకటే.భారతదేశంలో కేవలం 1-2% మందికి మాత్రమే అరేబియా మూలాలు ఉండొచ్చు, కానీ చాలామందిది భారతీయ మూలాలే.

నా సందేశం ఒక్కటే, ఎవరిలోనూ ద్వేషం ఉండకూడదు.మనమంతా శాంతిగా, ఐక్యంగా ఉండాలి” అని నియాజ్ ఖాన్ తేల్చి చెప్పారు.

తన జన్యు పరీక్షలు కూడా తనది భారతీయ మూలాలే అని నిరూపిస్తాయని ఆయన నొక్కి చెప్పారు.చరిత్రలో మతమార్పిడులు జరిగాయి కానీ అది ప్రజల మూలాలను మార్చదని ఆయన అన్నారు.తన అభిప్రాయాలను రాజ్యాంగ పరిమితుల్లోనే పంచుకున్నానని నియాజ్ ఖాన్ స్పష్టం చేశారు.తనతో ఎవరైనా గౌరవంగా విభేదించవచ్చు కానీ అందరూ ఐక్యత, దేశ నిర్మాణంపైన దృష్టి పెట్టాలని సదరు ఐఏఎస్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube