టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు.తమన్నా సంపత్ నంది(Tamannaah Sampath Nandi) కాంబోలో తెరకెక్కిన ఓదెల2 ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ఏకంగా 27 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు శాటిలైట్ మినహా 18 కోట్ల రూపాయలకు అమ్ముడవగా హిందీ మినహా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు 9.50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.విడుదలకు ముందే అరకోటి టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమా అందించగా తమిళ్ వెర్షన్, శాటిలైట్ హక్కుల ద్వారా ఎంతమేర వస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాను చూసి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓదెల2 మూవీ (Odela2 movie)బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఒకింత గట్టి పోటీనే ఉండనుందని తెలుస్తోంది.ఈ నెల 18వ తేదీన అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ కానుండగా అదే తేదీన ప్రియదర్శి సారంగపాణి జాతకం రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన సీజన్లలో సమ్మర్ కూడా ఒకటి.ఓదెల సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే తమన్నా ప్రధాన పాత్రలో మరిన్ని భారీ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.తమన్నా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.హీరోయిన్ తమన్నా రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.