అనుష్క శెట్టి( Anushka Shetty ).పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.అనుష్క( Anushka ) నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
టాలీవుడ్ లో దాదాపుగా చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి నటిగా మంచి ప్రశంసలు కూడా అందుకుంది.
కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ ఇమేజ్ వచ్చాకా మాత్రం అడియన్స్ ఆరాధించే దేవతగా మారింది.

బాహుబలి (Bahubali)సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది.ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది.అనుష్క చివరగా నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty )సరసన మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి (Miss Shetty Mrs.Polishetty)సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఆ తర్వాత ఒక స్టార్ హీరో సినిమాలో అనుష్కకు మంచి ఆఫర్ వచ్చిందట.ఆ సినిమా కోసం ఆమెకు రూ.5 కోట్లు పారితోషికం ఇస్తామని చెప్పారట.కానీ ఆ సినిమాలో నటించేందుకు అనుష్క అంగీకరించలేదట.
ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడమే అని సమాచారం.

అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోయిన అనుష్క వచ్చిన ఆ ఆఫర్ సైతం నటనకు ప్రాధాన్యత ఉండాలని రిజెక్ట్ చేయడం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం అనుష్క ఘాటీ చిత్రంలో (Anushka Ghati in the film)నటిస్తుంది.డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అనుష్క మాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.