టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్(Venkatesh).
హీరోగా రాణించడంతోపాటు సినిమాలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.అందరి హీరోలకు అభిమానులు ఉంటే వెంకీ మామకు(Venky Mama) మాత్రం డై హార్డ్ ఫాన్స్ ఉంటారని చెప్పాలి.
అందరూ హీరోల అభిమానులు కూడా వెంకీ మామకు వీరాభిమానులే అని చెప్పాలి.ఆ సంగతి పక్కన పెడితే విక్టరీ వెంకటేష్ కు సంక్రాంతి పండుగ(Sankranti festival) బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.
వెంకీ మామకు సంక్రాంతి పండుగ కలిసి రావడం ఏంటా అని అనుకుంటున్నారా, తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు వెంకీ మామ.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.అయితే అలా సంక్రాంతి (Sankranti) అనే టైటిల్ తోనే ఇరవై ఏళ్ళ క్రితం వెంకటేశ్ సినిమా వచ్చింది.అయితే సంక్రాంతి చిత్రం పొంగల్ కు రాలేదు కానీ, 2005 ఫిబ్రవరి 18న రిలీజ్ అయింది.
అయితేనేం ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి వెంకటేశ్ కు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది.అయితే సంక్రాంతి చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు.
వినిపించదు.అయినా ఉమ్మడి కుటుంబాల్లోని అన్న దమ్ముల అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించడంతో సంక్రాంతి చిత్రం ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది.
అయితే అంతకు ముందు సూపర్ గుడ్ బ్యానర్ లోనే వెంకటేశ్ హీరోగా రాజా చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించింది.ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ముప్పలనేని శివతోనే ఈ సంక్రాంతి కూడా రూపొందడం విశేషం.
అయితే ఈ రెండు చిత్రాలు తమిళ రీమేక్స్ కావడం గమనార్హం.తమిళంలో ఘనవిజయం సాధించిన ఆనందం ఆధారంగా సంక్రాంతి సినిమా రూపొందింది.
సంక్రాంతికి రాకపోయినా ఆ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా శివరాత్రి దాకా జనాన్ని విశేషంగా అలరించింది.ఇక సంక్రాంతి విజయం సాధించిన వెంకటేష్ సినిమాలకు కొదవలేదు.
రక్తతిలకం, శత్రువు, చంటి, ధర్మచక్రం, కలిసుందాం రా, లక్ష్మీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్ 2 లాంటి చిత్రాలు సంక్రాంతికి విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి.







