సాధారణంగా రక్తదానం చేయడం వల్ల బలహీనత పడతారని, అనేక వ్యాధులకు కారణమవుతుందని ఇలా చాలా అపోహలు రక్తదానం( Blood donation ) విషయంలో ఉన్నాయి.నిజానికి ఇవన్నీ ఆధారాలు లేని ప్రచారాలు మాత్రమే అని చెబుతున్నారు.
నిజమేమిటంటే రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇంకా రక్తదానం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని కలగదు.
అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఎందుకంటే అధిక శాతం మందికి రక్తదానం విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి.కానీ రక్తదానం మనకు అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుంది.మరి ఈ క్రమంలో రక్తదానం చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఇలా రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి( Heart Health ) ఎంతో మంచిది.ఎలాగంటే రక్తంలో ఐరన్ స్థాయి అదుపులో లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

రక్తదానం చేయడం వల్ల రక్తంలోని ఐరన్ స్థాయి అదుపులో ఉంటుంది.దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే రక్తదానం చేయడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.ఇంకా చెప్పాలంటే రక్త దానం చేయడం వల్ల కొత్త రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది.అందువల్ల సంవత్సరంలో ఒక్కసారైనా కచ్చితంగా రక్తదానం చేయాలి.

రక్తదానం చేయడం వల్ల పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు లాంటి అవయవాలు క్యాన్సర్( Cancer ) బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే రక్తదానం చేయడానికి 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు రక్త దానం చేయవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే వారి బరువు 45 కిలోల కంటే ఎక్కువగా ఉన్న వారు రక్తదానం చేయవచ్చు.
ఇంకా చెప్పాలంటే తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వ్యక్తులు కూడా రక్తదానం చేయకూడదు.







