ఎండ‌ల దెబ్బ‌కు విప‌రీత‌మైన నీర‌సం ప‌ట్టుకుందా.. అయితే ఇలా వ‌దిలించుకోండి!

అసలే వేసవి కాలం( Summer ).ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి.

 This Is The Natural Instant Energy Drink For Fatigue Relief! Instant Energy Drin-TeluguStop.com

భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.ఉదయం 11 దాటిందంటే ఎండ‌ల దెబ్బ‌కు బ‌య‌ట కాలు పెట్టాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

అయితే ఈ వేసవి కాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో నీరసం ఒకటి.ఎండల వేడి కారణంగా ఒంట్లో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంది.

ఈ క్ర‌మంలోనే శక్తి మొత్తం నశించిపోతుంది.దాంతో చాలా నీర‌సంగా మారిపోతారు.

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే న్యాచుర‌ల్ ఇన్‌స్టంట్ ఎన‌ర్జీ డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో మీ బాడీ శ‌క్తివంతంగా మారుతుంది.వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపిస్తుంది.

మరి నీరసాన్ని తరిమి కొట్టి శరీరాన్ని ఎన‌ర్జిటిక్ గా మార్చే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Fatigue, Tips, Instant Energy, Latest, Natural Energy-Telugu Health

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో నాలుగు వాల్ నట్స్( Walnut ), నాలుగు జీడిపప్పు, రెండు బ్రెజిల్ నట్స్, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు( Pumpkin Seeds ), వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు విత్తనాలు, వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలి.అలాగే ఆఫ్ బనానా తో పాటు ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేస్తే మన ఎనర్జీ డ్రింక్ సిద్ధం అయినట్టే.

Telugu Fatigue, Tips, Instant Energy, Latest, Natural Energy-Telugu Health

విపరీతమైన నీరసం తో బాధపడుతున్నప్పుడు ఈ డ్రింక్ ను తీసుకుంటే క్షణాల్లో ఎనర్జిటిక్ గా మారతారు.ఎలాంటి నీరసమైన దెబ్బకు పరార్ అవుతుంది.ఇన్‌స్టంట్ గా ఎనర్జీని పొందడానికి ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.గుండెపోటు( Heart attack ) వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఎముక‌లు దృఢంగా మారతాయి.మరియు హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube