దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.కానీ, దానిమ్మ తొక్కలు కూడా ఉపయోగపడతాయన్న విషయం మాత్రం దాదాపు చాలా మందికి తెలియదు.
అందుకే దానిమ్మ పండులో ఉండే గింజలను తీసుకుని.పై తొక్కలను చెత్త బుట్టలో వేసేస్తుంటారు.
కానీ, నిజానికి దానిమ్మ తొక్కలతో ఆరోగ్య పరంగానూ, సౌందర్య పరంగానూ అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.దానిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి సలాడ్స్ రూపంలో తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.
అలాగే మరిన్ని అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.ఇక సౌందర్య పరంగా కూడా దానిమ్మ తొక్కలను ఉపయోగించుకోవచ్చు.మొటిమల సమస్యతో బాధ పడుతున్న వారు దానిమ్మ తొక్కలను ఎండబెట్టి.పొడి చేసుకోవాలి.
అనంతరం ఈ పొడిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ముఖానికి అప్లై చేసి.పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలతో పాటు నల్ల మచ్చలు కూడా పోతాయి.
అలాగే దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
ఆ పొడిలో కొద్దిగా పెరుగు వేసి బాగా కలిపి.ముఖానికి పట్టించాలి.
ఇరవై నుంచి ముప్పై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తుంది.
ఇక బాగా ఎండబెట్టి గ్రైండ్ చేసుకున్న దానిమ్మ తొక్కల పొడిలో చిటికెడు పసుపు మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి.అనంతరం బాగా ఆరిపోయాక.
ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల జిడ్డు చర్మం దూరం అయ్యి.
ముఖం తాజాగా అందంగా మారుతుంది.