తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు సైతం భారీ విజయనందుకోవడానికి చాలా వరకు తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.
అందులో భాగంగానే రామ్ పోతినేని లాంటి నటుడు సైతం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart)సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ (Sequel to Ismart Shankar’s movie)గా వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని నమోదు చేయకపోవడంతో మహేష్ బాబు(Mahesh Babu) అనే ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండటం విశేషం…ఈ సినిమాతో ప్రేక్షకులను అనుభవించడానికి మరోసారి ఆయన సిద్ధమయ్యాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ (Ram dual role)లో నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక దర్శకుడు మహేష్ బాబు ఇంతకుముందు చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక అదే నేపధ్యంలో ఈ సినిమాను కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే రామ్ పోతినేని స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు వచ్చినప్పటికి ఆయనకు సక్సెస్ రేట్ సరిగ్గా లేకపోవడంతో ఇండస్ట్రీలో ఆయన మీడియం రేంజ్ రోగానే కొనసాగుతున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.