టాలీవుడ్, కోలీవుడ్( Tollywood, Kollywood ) ఇండస్ట్రీలలో మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ ( Jivi Prakash )బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.జీవీ ప్రకాష్ ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
జీవీ ప్రకాష్ సింగర్ సైంధవ్ ( Singer Saindhav )కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.ఎంతగానో ఇష్టపడ్డ జోడీ విడిపోవడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.
అయితే జీవీ ప్రకాష్ హీరోయిన్ దివ్య భారతితో( heroine Divya Bharti ) ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి.అయితే ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో జీవీ ప్రకాష్ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మేము బ్యాచ్ లర్ సినిమా కోసం కలిసి పని చేశామని అంత మాత్రాన మేము డేటింగ్ లో ఉన్నామని జనాలు ఏవేవో ఊహించుకుంటున్నారని జీవీ ప్రకాష్ చెప్పుకొచ్చారు.

మేము కేవలం సాధారణ స్నేహితులం మాత్రమేనని ఆయన అన్నారు మూవీ షూట్ పూర్తైన తర్వాత ఒక్కసారి కూడా కలుసుకోలేదని జీవీ ప్రకాష్ వెల్లడించారు.మళ్లీ ఇలా ప్రమోషన్స్ లో మాత్రమే కలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ ఆరోపణల గురించి దివ్యభారతి సైతం తన వంతు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.
జీవీ ప్రకాష్ దంపతుల విడాకులకు నేనే కారణమని చాలామంది మెసేజ్ లు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో నన్ను టార్గెట్ చేస్తారని అస్సలు ఊహించలేదని దివ్యభారతి పేర్కొన్నారు.ఈ విడాకులకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చారు.జీవీ ప్రకాష్ సైంధవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.2013 సంవత్సరంలో ప్రకాష్ సైంధవిల పెళ్లి జరిగింది.2020 సంవత్సరంలో ఈ దంపతులకు ఒక కూతురు పుట్టింది.జీవీ ప్రకాష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.