కలోంజి సీడ్స్.వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
వీటిని బ్లాక్ సీడ్స్ లేదా ఆనియన్ సీడ్స్ అని కూడా పిలుస్తుంటారు.ఉల్లి, మిరియాల రుచిని తలపించే కలోంజి సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ కె, ప్రోటీన్, ఫైబర్‌తో పాటు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా కలోంజి సీడ్స్ అనేక ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా కలోంజి సీడ్స్ తో టీ తయారు చేసుకుని తీసుకుంటే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం కలోంజి సీడ్స్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, అర స్పూన్ అల్లం తరుగు, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన నీటిని స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకుని, రుచికి సరిపడా తేనెను యాడ్ చేసుకుంటే కలోంజి టీ సిద్ధం అవుతుంది.
చక్కటి రుచిని కలిగి ఉండే ఈ టీ ని రోజుకు ఒక కప్పు చప్పున ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి వెయిట్ లాస్ అవుతారు.రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. క్యాన్సర్ వంటి ప్రమదకరమైన వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రంగా మారుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
మరియు మెదడు పని తీరు సైతం మెరుగ్గా మారుతుంది.