ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేజేతులా ఇంత పెద్ద నష్టం తనకు తానే చేసుకున్నారా ?

ఎవరైనా తెలిసి తెలిసి పప్పులో కాలేస్తారా.,? మన జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )చేసేసాడు ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి అంటే మెహర్ రమేష్ తో కలిసి మాట్లాడటం.అదేంటి కలిసి మాట్లాడటం తప్పేలా అవుతుంది అందరిలో మనం మాట్లాడుతూనే ఉంటాం కదా అని మీరు అనుకుంటున్నారేమో.కానీ అందరితో మాట్లాడటం వేరు జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ తో మాట్లాడటం వేరు.

 Jr Ntr And Mehar Ramesh Workout On Shakthi Movie ,junior Ntr, Meher Ramesh ,a-TeluguStop.com

అలా మాట్లాడటం వల్లే జూనియర్ తన కెరియర్ లో ఎప్పటికి పూడ్చుకోలేని ఒక డిజాస్టర్ సినిమాని ఖాతాలో వేసుకున్నాడు.పైగా ఈ విషయంలో మెహర్ రమేష్ తప్పు కూడా ఏమీ లేదు.

ఇప్పటికే విషయం మీకు కొంత మేర అర్థమయి ఉండొచ్చు.వీరిద్దరి కాంబినేషన్ లో ఒక శక్తి అనే కళాఖండం వచ్చింది.

ఇప్పుడు అది ఎందుకు గుర్తు చేస్తున్నారు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని అనుకుంటున్నారు కదా.

Telugu Aswani Dutt, Ntr, Meher Ramesh, Shakthi, Tollywood, Vyjayanthi-Movie

మరి అక్కడికే వస్తున్న… అసలు ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తనకు తానుగా తీసుకున్న గోతి లాంటిది.తను తీసుకున్న గోతిలో తానే పడ్డారు.ఒకసారి ఫారన్ కంట్రీ లో మెహర్ రమేష్ అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ ని కలిశారట.

అక్కడే శక్తి సినిమా కథను మెహర్ తారక్ కి వినిపించారట.నిజానికి మెహర్ రమేష్( Meher Ramesh ) కి తారక్ తో శక్తి సినిమా తీయాలని ఏమీ లేదట.

అలా క్యాజువల్ గా కథను ఆయనకు చెప్పారట.కథ వింటున్న సమయంలో జూనియర్ కి కూడా ఆ సినిమా తానే చేయబోతాను అనే విషయం తెలియదట.

అలా అనుకోకుండా మొత్తానికి కథ అయితే విన్నారు దాంతో ఆయనకు ఆ కథ పిచ్చిపిచ్చిగా నచ్చింది.

Telugu Aswani Dutt, Ntr, Meher Ramesh, Shakthi, Tollywood, Vyjayanthi-Movie

ఆ తర్వాత ఇండియాకు వచ్చిన మెహర్ రమేష్ తన సినిమా కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నారు.అప్పుడు తారక్ ఫోన్ చేసి మరి ఈ సినిమా నాతో కాకుండా ఇంకా ఎవరితో చేస్తావు అని అడిగేసరికి మెహర్ వేరే ఆప్షన్ లేకుండా శక్తి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తోనే తెరకెక్కించారు.ఇలా గాలికి పోయే దరిద్రాన్ని ఆయన తగిలించుకొని అంత పెద్ద డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.

దీనినే అంటారు తాను తీసుకున్న గోతిలో తానే పడటం అని.ఇది మొత్తం చూసాక మీకు కూడా అలాగే అనిపించింది కదా.మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube