చాలామంది డబ్బులు సంపాదించాలనే కోరికతో బిజీ లైఫ్ ని గడుపుతూ ఉన్నారు.కనీసం తినడానికి కూడా టైం సరిగ్గా ఇవ్వడం లేదు.
ఇక నచ్చినవన్నీ, అందుబాటులో ఉన్నవన్నీ సులభంగా తయారు చేసుకుని ఏదో ఒకటి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినేసి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో ( empty stomach )తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి.
వాటిపై అవగాహన లేకపోతే మనకు ప్రమాదం ఉంటుంది.దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడతారు.
అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ, టీలు( Coffee , tea ) అస్సలు తీసుకోకూడదు.ఎందుకంటే చాలామంది బెడ్ కాఫీ, టీ అని ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రష్ కూడా చేయకుండా తాగేస్తూ ఉంటారు.అయితే ఇలా తీసుకోవడం వలన శరీరంలో హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఎసిడిటీ సమస్య కూడా తలెత్తుతుంది.అందుకే సాధ్యమైనంత వరకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ,కాఫీలు తాగడం మానేయాలి.
అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కూల్డ్రింక్స్( Cooldrinks ) లాంటి చల్లటి పదార్థాలను కూడా అస్సలు తీసుకోకూడదు.
వీటిని తీసుకోవడం వలన గ్యాస్, కడుపులో అల్సర్, వాంతులు అవడం లాంటివి జరుగుతాయి.అందుకే కూల్ డ్రింక్స్ ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు.దీనికి బదులుగా తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం చాలా మంచిది.
ఇక ఖాళీ కడుపుతో టమాటాలను( Tomatoes ) కూడా అసలు తీసుకోకూడదు.ఉదయం పూట ఖాళీ కడుపుతో టమాటాలను తీసుకోవడం వలన వాటిలో ఉండే ఆసిడ్ల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా ఉదయం పూట ఖాళీ కడుపుతో కారంగా ఉండే పదార్థాలను, మసాలా దట్టించి వండిన పదార్థాలను కూడా అస్సలు తీసుకోకూడదు.ఇలా తీసుకోవడం వలన కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ లాంటి సమస్యలు వస్తాయి.
ఇక పరగడుపున పెరుగును కూడా అస్సలు తీసుకోకూడదు.పెరుగు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ ఉదయం పూట ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు తీసుకోకూడదు.
ఇలా తీసుకోవడం వలన ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది.ఇక ఆల్కహాల్ ను కూడా పరగడుపున అస్సలు తీసుకోకూడదు.
ఇలా చేస్తే ప్రాణానికే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు.