ఈ ఐపీఎల్ సీజన్-16 ( IPL 16 ) ఎంతో అట్టహాసంగా మొదలై , నువ్వా నేనా అంటూ ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ ప్రేక్షకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.ఈ ఐపీఎల్ లో మొత్తం 70 లీగ్ మ్యాచ్లలో ఇప్పటికీ 35 మ్యాచ్లు ముగిసాయి.
ఆరంభంలో కాస్త డల్ గా అనిపించిన మ్యాచులు.రాను రాను ఎంతో ఆసక్తికరంగా సాగుతూ, చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేనంత ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం ఏ జట్టు ఏ స్థానంలో ఉందో చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్:
మొదటి మ్యాచ్ గుజరాత్ చేతిలో ఓడిన చెన్నై జట్టు( CSK ) ప్రస్తుతం పది పాయింట్లతో లీగ్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.చెన్నై జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో విజయం సాధించింది.
గుజరాత్ టైటాన్స్:
ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం ప్రారంభించింది.ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లు గెలిచి పది పాయింట్ లతో, నెట్ రేట్ కారణంగా రెండో స్థానం తో నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్:
ఈ జట్టు కూడా మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ పై ( SRH ) ఘనవిజయం సాధించి, శుభారంభం ప్రారంభించింది.ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్:
ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లతో నెట్ రేట్ కారణంగా నాలుగో స్థానంలో నిలిచింది.
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు:
ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.
పంజాబ్ కింగ్స్:
ఈ జట్టు కూడా ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచింది.
ముంబై ఇండియన్స్:
ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో మూడు మ్యాచ్లు గెలిచి ఆరు పాయింట్లతో ఏడవ స్థానంలో నిలిచింది.
కోల్ కత్తా నైట్ రైడర్స్:
ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది
సన్ రైజర్స్ హైదరబాద్:
ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్:
ఈ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతో పదవ స్థానంలో నిలిచింది.