ప్రదోషార్చన విశిష్ఠత ఏమిటి?

శ్రీ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా, తయోః సంస్మర.ణాత్ పుంసాం సర్వతోజయ మంగళ… శివ స్వరూపమూ నామమూ శుభ ప్రదమైనవి.

 What Is The Story Of Pradosharchana , Devotional , Pradosharchana , Telugu Devo-TeluguStop.com

ఆనందం ఇచ్చేవి.పార్వతియే సర్వ మంగళములు ఇచ్చే తల్లి.

ఆ ఇరువురి స్మరణము అన్ని శుభాలనూ సర్వవిధ మంగళములనూ ప్రసాదిస్తుంది.కార్తీక సోమ వారాలు శివా శివులకు ప్రీతికరమైన రోజులు.

అంబతో వున్న శివునికి “సాంబశివుని”కి అత్యంత ప్రీతి పాత్రాలు.ఈ విధంగా సోమ వారాలు ప్రదోషంలో దీపం, ధూపం, నైవేద్యాలు చేసే వారికి సాంబశివుడు సకల అభీష్టాలూ తీరుస్తాడు.

సర్వ విధమైన శని బాధలు నశింప చేస్తాడు.కాల స్వరూపుడు కనుక, నవ గ్రహాలూ కాలము నందలివే కనుక, ఆయా వారాలలో ప్రదోష సేవ చేసిన వారికి ఆయా గ్రహ దోషాలు తొలగించి సాంబ శివుడు అనుగ్రహి స్తాడు.

సూర్యుడు అస్తమించిన ఒక గంట తరువాత వచ్చేది ప్రదోషం, ఇది కాల విశేషం.ఒక గంట అనగా మూడు ఘడియల కాలం.

ఈ ప్రదోష కాలంలో శివుని సేవించిన వారికి సర్వవిధ దోషాలు తొలగి శ్రేయోభివృద్ధి కలుగుతుంది.ఇదే ప్రదోషార్చన.

ఈ ప్రదోష కాలంలో దేవతలందరూ ఒకేచోట ఉంటారట.

కైలాస పర్వతంపై… భవనంలో త్రిజగజ్జనని గౌరి రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం పైన ఆసీనయై ఉంటుంది.

ఆ తల్లి ఎదుట శివుడు నాట్యం చేస్తాడట.సరస్వతి వీణ వాయిస్తున్నది.

ఇంద్రుడు వేణువును ఉదుతాడట.బ్రహ్మ తాళం వేయడం, లక్ష్మీ దేవి పాట పాడడం, మహా విష్ణువు మృదంగం వాయిస్తున్నాడట, గంధర్వులూ, సిద్ధులూ, దేవతలూ ఈ । వేళ సేవించుకొని, తమ తమ కోరికలు .మహిమాన్వితమైనది కార్తీకం… దైవస్మరణతో పంచుకోండి తీర్చుకుంటారు ఈ ప్రదోష అంతటి ఆనందంగా పొందండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube