కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే.ఈ ఆలయం దర్శనార్థం రోజుకు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.
కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారం చేసే శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారికి పెద్ద ఎత్తున కానుకలు చెల్లిస్తూ ఉంటారు.అయితే మనం శ్రీవారి హుండీలోఏ విధమైనటువంటి ముడులు వేయడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయో అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామి వారికి వచ్చే కానుకలు కోట్లల్లో ఉంటాయి మన దేశంలో లేదా ఇతర దేశాలలో ఏ ఆలయంలో రాని ముడుపులు తిరుమల శ్రీవారికి వస్తాయి.
ఈ క్రమంలోనే స్వామివారికి ముడుపులు వేసేవి మూడు రకాలు ఉంటాయి.వాటిలో ఒకటి నిష్కామ పుణ్యదినం.
ఇలా ఈ ముడుపు వేసేవారు ఏవిధమైనటువంటి పాప పనులు చేయకుండా డబ్బు సంపాదించి ఉంటారు.ఈ డబ్బు వేసేటప్పుడు ఎవరూ కూడా ఏ విధమైనటువంటి కోరికలు కోరుకోరు మీ దయవల్ల నేను ఇలా ఉన్నాను అని మొక్కుకొని స్వామివారికి ఈ ముడుపులు చెల్లిస్తారు.
ఈ విధంగా ఏ భక్తులు అయితే ఈ విధమైనటువంటి కోరిక కోరుకుని డబ్బు వేస్తారో ఆ ధనం మాత్రమే స్వామివారి కుబేరుడి వడ్డీ చెల్లిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఇక చాలామంది కోరికలు కోరుకొని స్వామివారికి ముడుపులు చెల్లిస్తారు.నా జీవితంలో నాకు సంతానం కలిగితే మీకు ఇది చెల్లిస్తాను లేదా నాకు పెళ్లి జరిగితే మీకు ఈ కానుక సమర్పిస్తానని భక్తులు మొక్కుకొని స్వామి వారికి చెల్లించే ముడుపును పుణ్య ధనం అంటారు.ఈ విధంగా కోరికలు కోరి స్వామి వారి ఆలయంలో వేసిన ముడుపులను అన్నదానానికి వేద పాఠశాలలకు పంపిస్తారు.
ఇలా భక్తులు వేసిన ఈ ముడుపు వల్ల వారికి ఏ విధమైనటువంటి పాపాలు లేకుండా స్వామి వారు వారిని కాపాడుతారని అర్థం.
ఇక చాలా మంది అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వామివారికి సమర్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కాపాడమని వేడుకుంటారు.అయితే ఈ విధంగా డబ్బు హుండీలో వేస్తారు ఈ విధంగా పాపపు సొమ్మును హుండీలో వేయడం వల్ల చాలామంది తరతరాలుగా వారి కర్మకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తుంటారు.