భార్యతో గొడవపెట్టుకుందని చెల్లిని చంపిన ప్రబుద్ధుడు

తన భార్యతో గొడవ పడిందనే నెపంతో ఓ ప్రబుద్ధుడు చేసిన ఘనకార్యంతో ఆ వార్త బెంగుళూరులో హాట్ టాపిక్‌గా మారింది.కంప్లి పరిధిలోని సణ్ణాపురం గ్రామ పంచాయతీలోని ఇటిగి గ్రామంలో దళిత మురారమ్మ(45) తన అన్న ముకుందప్ప ఇంటికి వచ్చింది.

 Man Kills Sister Over Clash With Wife-TeluguStop.com

ఈ క్రమంలో తన అన్న భార్యతో మురారమ్మ గొడవ పడింది.

ఈ విషయం తెలుకున్న ముకుందప్ప తన భార్యతో గొడవ పడతావా అంటూ తన చెల్లెలిపై కోపంతో ఊగిపోయాడు.

అదే ఆవేశంలో ముకుందప్ప ఓ కర్ర తీసుకుని తన చెల్లెలిపై దాడి చేశాడు.దీంతో తీవ్ర గాయాలపాలైన మురారమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా కేసు నమోదు చేసిన పోలీసులు, మురారమ్మ తన అన్న భార్యతో ఏ విషయంలో గొడవ పడిందని, అది హత్యకు ఎందుకు దారి తీసిందనే అంశాలపై విచారణ చేపట్టారు.

ఏదేమైనా కోపంతో తన చెల్లిని చంపుకున్న ముకుందప్పపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube