ఆచార్య, విరాట పర్వం సినిమాలపై యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ విషయంపై టాలీవడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.నక్సలిస్టులను, మావోలను హీరోలుగా చూపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఆమోదం తెలుపకూడదని యాంటీ టెర్రరిజం ఫోరమ్ ఫిర్యాదు చేసింది.
త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న ఆచార్య, విరాట పర్వం రెండు సినిమాలు కూడా ఇదే నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ రెండు భారీ చిత్రాలు కూడా నక్సలిజం అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.
విరాట పర్వంలో రానా హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాలో రానా మావోయిస్టుగా కనిపించబోతున్నాడు.
వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
కామ్రేడ్ రావన్న జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఆచార్య సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమా కూడా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతోందని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.
ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
కానీ ఇలాంటి సినిమాలకు యాంటీ టెర్రరిజం ఫోరమ్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది.
మావోయిజం, నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు క్లియరెన్సు ఇవ్వకూడదని సెన్సార్ బోర్డును కలిసింది.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
విరాట పర్వం ఏప్రిల్ 30 న విడుదల అవ్వబోతుండగా, ఆచార్య సినిమా మే 13 న విడుదల కాబోతుంది.మరి చూడాలి సెన్సార్ బోర్డు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో
.