హెయిర్ ఫాల్, డ్రై హెయిర్.. రెండింటికి చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ జెల్ ఇది..!

హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో బాధపడుతున్నారా.? హెయిర్ తరచూ డ్రైగా మారిపోతుందా.? అయితే ఈ రెండు సమస్యలకు ఒకేసారి అది కూడా ఇంట్లోనే సులభంగా చెక్ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ జెల్ ది బెస్ట్ వన్ గా వర్కోట్ అవుతుంది.

 This Natural Gel Helps To Get Rid Of Hair Fall And Dry Hair Problems! Hair Fall,-TeluguStop.com

మరి ఇంతకీ ఆ జెల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా నాలుగు మందారం ఆకులను( Hibiscus leaves ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే నాలుగు మందారం పువ్వులను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న మందారం పువ్వులు మరియు ఆకులు వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిపి నైట్ అంతా వదిలేయాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను చేత్తో క్రష్ చేయడం ద్వారా వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.

Telugu Dry, Care, Care Tips, Gel, Healthy, Latest, Natural Gel, Silky, Fall, Nat

అప్పుడు ఆ జెల్ ను క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్ లోకి వేసుకోవాలి.ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.అనంతరం తయారు చేసుకున్న జెల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.జెల్ అప్లై చేసుకున్న గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Dry, Care, Care Tips, Gel, Healthy, Latest, Natural Gel, Silky, Fall, Nat

వారానికి ఒకసారి ఈ న్యాచురల్ జెల్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.ఈ జెల్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అలాగే ఈ జెల్ హెయిర్ ను హైడ్రేట్ గా ఉంచుతుంది.పొడి జుట్టును రిపేర్ చేస్తుంది.సహజంగానే కురులను సిల్కీగా మరియు షైనీగా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube