ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే నట్స్ జాబితాలో బాదం( almond ) ముందు వరుసలో ఉంటుంది.ఆరోగ్యానికి వరమైన బాదం గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు మినరల్స్ తో సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి.
రోజుకు నాలుగు నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల వివిధ జబ్బులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం బాదం పప్పును తినకూడదు.
ఆ కొందరు ఎవరు.? వారు ఎందుకు బాదం తినకూడదు.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నట్ అలెర్జీలు ఉన్న వ్యక్తులు బాదం పప్పులకు దూరంగా ఉండాలి.
ఎందుకంటే అవి దద్దుర్లు, వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి.అలాగే కిడ్నీలో రాళ్లు( Kidney stones ) ఉన్నవారు లేదా ఆక్సలేట్‌లతో సమస్యలు ఉన్నవారు బాదంపప్పును ఎవైడ్ చేయడమే మంచిదని అంటున్నారు.
బాదంలో ఆక్సలేట్లు ఉంటాయి, ఇవి కిడ్నీ స్టోన్స్ సమస్యనే మరింత తీవ్ర తరంగా మారుస్తాయి.ఒకవేళ కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాదం పప్పును తినాలి అనుకుంటే వైద్యుడిని సలహా తీసుకోవడం ఎంతో మేలు.
దంతాలు( teeth ) లేని చిన్న పిల్లలకు, ముసలివారికి బాదం పప్పును ఇవ్వకపోవడమే ఉత్తమం.ఎందుకంటే, వారు బాదంను సరిగ్గా నమలేరు.నేరుగా మింగడం వల్ల గొంతులో ఇరుక్కోవడం, ఊపిరి అందకపోవడం వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది.ఇకపోతే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ అతిగా బాదం ను ఎప్పుడూ తినకూడదు.
ఎందుకంటే బాదంపప్పులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం( Bloating, gas, constipation ) మరియు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
బాదంపప్పులో క్యాలరీలు మరియు కొవ్వులు ఉంటాయి.కాబట్టి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు.అంతేకాదు బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది కాల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి ఖనిజాలను మీ శరీరం గ్రహించడాన్ని కష్టతరం చేస్తుంది.కాబట్టి రోజుకు పది బాదం గింజలకు మించి తినే అలవాటు ఉంటే మానుకోండి.