కృష్ణయ్య రాజీనామా ఎందుకు చేశారు ? వీటికి సమాధానం ఏది?

వైసిపికి ( YCP )రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం గా మారింది.ఆయన వైసీపీకి రాజీనామా చేయడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారు.

 What Is The Answer To Why Krishnaiah Resigned, Brs, Bjp, Congress, Tdp,ysrcp, R-TeluguStop.com

అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమేనని ఆర్ కృష్ణ( R Krishna ) ప్రకటించారు.అయితే రాజ్యసభలో బీసీల సమస్యలపై మాట్లాడేందుకు చక్కని అవకాశాన్ని చేజార్చుకున్నారని,  ఇంకా నాలుగేళ్లు పదవీకాలం ఉన్నా.

  ఎవరికి చెప్పకుండా ఆయన రాజీనామా చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  రాజకీయాలకు అతీతంగా తాను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని ఆర్ కృష్ణ చెబుతున్నారు.

అందుకే పదవికి రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు అయితే వైసీపీకి రాజీనామా చేసినా, పదవికి రాజీనామా చేయకుండా ఉంటే బీసీలు కూడా నమ్మి ఉండేవారని , కానీ నాలుగేళ్ల పదవీ కాలాన్ని, బీసీ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించే చక్కటి అవకాశాన్ని చేజేతుల పోగొట్టుకున్నారనే విమర్శలు వ్యక్తం అవతున్నాయి.

Telugu Congress, Krishnayya, Rajyasabha, Telangana, Krishnaiah, Ysrcp-Politics

అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటనే దానిపైన చర్చ జరుగుతోంది.  వాస్తవంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకుంటే రాజ్యసభ సభ్యత్వం అడ్డం వస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తన లక్ష్యమని చెబుతున్న ఆర్.

కృష్ణయ్య ( R.Krishnaiah )రాజ్యసభ పదవి వల్లనే తాను ఉద్యమాన్ని బలోపేతం చేయలేకపోతున్నానని చెబుతుండడం సరైన కారణంగా కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వాస్తవంగా పార్టీకి,  పదవికి బీసీలు ఉద్యమం కోసమే రాజీనామా చేయాలనుకుంటే ఆ విషయాన్ని వైసిపి అధినేత జగన్ ( YCP chief Jagan )కు సమాచారం ఇచ్చే ఉండే వారిని , అలాగే బిసి ముఖ్య నేతలతోనూ సమావేశమై తాను రాజీనామా చేస్తున్నాననే విషయాన్ని ప్రార్థించే వారిని,  కానీ ఏకపక్షంగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం వెనుక కొందరు ప్రయోజనాల కోసమే అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఆర్ కృష్ణయ్య బీసీల ప్రయోజనం కోసమే పోరాటం చేశారు.

మొదటి నుంచి బీసీ ఉద్యమాన్ని లేవనెత్తారు.ఆ ఉద్యమమే ఆయనకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది.

Telugu Congress, Krishnayya, Rajyasabha, Telangana, Krishnaiah, Ysrcp-Politics

ఆర్ కృష్ణయ్య ఎవరి మాటలకు తలొగ్గి రాజీనామా చేశారో అందరికీ తెలుసునని, రాజీనామా వల్ల నష్టపోయింది ఎవరు ?  లబ్ధి పొందేది ఎవరో కూడా తెలుసునని కొంతమంది బీసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు .అయితే జగన్ తనను రాజకీయంగా వాడుకోవాలని చూసినందునే తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణ ప్రకటించారు.ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య రాజీనామా పై ఏపీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది.ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నేతగా ఉన్నప్పటికీ.ఇప్పటికే  అనేక పార్టీలు మారారు.2014లో టిడిపి( TDP ) తరఫున ఎల్బీనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు.ఆ తరువాత రాష్ట్ర విభజన తర్వాత టిడిపి అధికారంలోకి వస్తే ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు . కానీ అప్పుడు బీఆర్ఎస్ గెలవడంతో టిడిపికి రాజీనామా చేశారు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.ఆ తర్వాత వైసిపి అధినేత జగన్ ఆర్.కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వగా, ఆయన ఇటీవల రాజీనామా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube