సాధారణంగా ఇతర భాషల హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నా ఆ హీరోలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో ఆఫర్లు రావడం జరుగుతుంది.మహానటి,( Mahanati ) సీతారామం,( Sita Ramam ) లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమాలతో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు.
దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లక్కీ భాస్కర్ సినిమాతో సితార బ్యానర్ కు భారీ హిట్ దక్కింది.
సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు వేరే లెవెల్ లో ఉంది.ఊహించని ట్విస్టులతో క్లైమాక్స్ ను ప్లాన్ చేయడం సినిమాకు మరింత ప్లస్ అయింది.
లక్కీ భాస్కర్ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరిగినా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

దుల్కర్ సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలను అందుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.కథాబలం ఉన్న సినిమాలకు దుల్కర్ ప్రాధాన్యత ఇస్తున్నారు.దుల్కర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
దుల్కర్ సల్మాన్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.గురువారం రోజున రిలీజ్ కావడంతో ఫస్ట్ వీకెండ్ సెలవులను ఈ సినిమా ఊహించని స్థాయిలో క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.లక్కీ భాస్కర్ సక్సెస్ సితార బ్యానర్ కు జోష్ నింపింది.2024 సంవత్సరం సితార బ్యానర్ కు బాగానే కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్స్ సెలక్షన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.







