గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే, వివిధ చిత్ర పరిశ్రమలలో పెనుమార్పులే సంభవించాయి అని చెప్పుకోవచ్చు.ఓ రకంగా చెప్పాలంటే, హాలీవుడ్ సినిమాల స్టైల్ ఇక్కడికి వలస వచ్చింది.
అయితే దానికి నాంది పలికింది మాత్రం టాలీవుడ్ సినిమా బాహుబలి( Bahubali ) అని చెప్పుకోవచ్చు.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమాని ప్రపంచ పటంలో నిలబెట్టగలిగింది.
అక్కడి నుండే ప్లాన్ ఇండియా సినిమాల పరంపర మొదలయ్యింది.అంటే ఒక్క కథనే రెండు మూడు కథలుగా చెప్పడం… ఆ సినిమా కథలకు మరో సినిమా కథలకు లింకు పెట్టడం మొదలైంది అని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో వచ్చిన సినిమానే తమిళ సినిమా విక్రమ్.( Vikram Movie ) లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించి, ఎల్ సి యు ( లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) క్రియేట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వచ్చిన సినిమానే హీరో విజయ్ నటించిన లియో సినిమా.( Leo ) ఇక టాలీవుడ్ లో కూడా ఈ పరంపరం మొదలైంది హనుమాన్( Hanuman ) సినిమాతోనే.
ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ పి వి సి యు ( ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించడం జరిగింది.ఈ వరల్డ్ లో నెక్స్ట్ రాబోతున్న సినిమా జై హనుమాన్.
( Jai Hanuman ) ఇలా మరికొందరు దర్శకులు వీరి మార్గంలోనే పయనిస్తుండడం విశేషం అనే చెప్పుకోవాలి.
అయితే ఈ కలయికలు ఇక్కడ కొత్తగానీ, ఫారెన్ సినిమాలలో ఇది కొత్త విషయం ఏమీ కాదు.ప్రముఖ హాలీవుడ్ సంస్థ మార్వెల్ ఎప్పటి నుండో ఈ పరంపరని కొనసాగిస్తూ వస్తోంది.ఆయా సినిమాల ద్వారా ఎంతో మంది సూపర్ హీరోలు పరిచయం అయ్యారు.
అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాల హవా నడుస్తోంది కాబట్టి, హిందూ పురాణాలలో సూపర్ హీరోలు అయినటువంటి హనుమాన్, కర్ణ, కృష్ణ, రామ, పరశురామ, బలరామ, ఘటోత్కచ, అశ్వద్ధామ, అర్జున వంటి రకరకాలైన పాత్రలు ఇప్పుడు పురుడు పోసుకుంటున్నాయి.