సూర్య సినిమాకు భారీ షాక్.. ఆ పిటిషన్ తో సినిమా రిలీజ్ కు ఇబ్బందులు తప్పవా?

తమిళ హీరో సూర్య ( Surya ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ.( Kanguva ) ఈ సినిమాపై ఈ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే.

 Studio Green Comments Kanguva Movie Will Not Released Nov 7 Details, Kanguva, Ko-TeluguStop.com

శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా బాబి డియోల్ వీడియోలు కీలక పాత్రలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కే ఈ.జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ మూవీ కోసం ఆయన భారీగానే ఖర్చు పెట్టారు.

అయితే ఈ సినిమా విడుదల విషయంలో పలు అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి.రిలయన్స్‌( Reliance ) నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో కంగువ సినిమా రిలీజ్‌ విషయంలో మద్రాస్‌ కోర్టు( Madras Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telugu Surya, Kanguva, Kollywood, Reliance, Teddy, Thangalaan-Movie

3డీ ఫార్మెట్‌ లో 10 భాషల్లో నవంబర్‌ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసింది.అయితే ఈ సినిమా నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌ రాజా,( Producer KE Gnanavel Raja ) రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల చిక్కులు ఉన్నాయి.స్టూడియో గ్రీన్( Studio Green ) నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ 2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్‌ రాజా రుణం పొందారట.అయితే, ఇప్పటికే రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు అయ్యింది.

Telugu Surya, Kanguva, Kollywood, Reliance, Teddy, Thangalaan-Movie

తమకు చెల్లించాల్సిన డబ్బు అందేవరకు సూర్య నటించిన కంగువ సినిమా విడుదలను ఆపేయాలని రిలయన్స్‌ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది.మరోవైపు తంగళాన్‌( Thangalaan ) సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఆ పిటిషన్‌ లో పేర్కొంది.జస్టిస్ కుమారేష్ బాబు ముందు కేసు విచారణకు వచ్చినప్పుడు స్టూడియో గ్రీన్ ఇలా తెలిపింది.నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరింది.అప్పటి వరకు కంగువ సినిమాను విడుదల చేయబోమని తెలిపింది.ఈ క్రమంలో తంగలాన్‌ చిత్రాన్ని కూడా నవంబర్‌ 7వరకు విడుదల చేయబోమని హామీ ఇచ్చింది.

దీనిని నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.అయితే, కంగువ చిత్రం నవంబర్‌ 14న విడుదల కానుంది.

ఆ సమయంలోపు ఈ కేసు క్లియర్‌ కాకపోతే సినిమా విడుదలకు చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలే పేర్కొంటున్నాయి.మరీ ఆ ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube