ఏదైనా మ్యారేజ్, ఫ్యామిలీ ఫంక్షన్ లేదా ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్ ఉంటే కాస్త అట్రాక్టివ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.మేకప్ తో ఎంత మెరుగులు దిద్దిన సరే సహజ మెరుపు లేకుంటే ఏదో వెలితిగానే కనిపిస్తుంది.
అందుకే మ్యారేజ్ ఉన్న మీటింగ్ ఉన్న ముందు రోజు నైట్ ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ ఫేస్ మాస్క్ ను ట్రై చేయండి.ఈ మాస్క్ వేసుకుంటే ఉదయానికి ముఖం వెలిగిపోతుంది.
మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు బాదం పప్పులు వేసి హాట్ వాటర్ పోసి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత బాదం పప్పులకు ఉన్న తొక్కను తొలగించి మిక్సీ జార్లో వేసుకోవాలి.అలాగే అదే మిక్సీ జార్ లో అరకప్పు బాగా వాడిన బొప్పాయి పండు ముక్కలు ( Papaya slices )వేసి స్మూత్ ప్యూరీ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బొప్పాయి బాదం మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె, ( Honey )రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా నాలుగు ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ మాస్క్ ను ట్రై చేస్తే ఉదయానికి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.
డల్ నెస్ పూర్తిగా తొలగిపోతుంది.సహజ మెరుపు మీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
సహజంగానే మీరు ఎంతో అందంగా కనిపిస్తారు.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.
కాబట్టి ఇకపై ఏ ఫంక్షన్ ఉన్నా మీటింగ్ ఉన్న తప్పకుండా ఈ మాస్క్( Mask ) ను ట్రై చేయండి.అందంగా మెరిసిపోండి.