హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
మాతృభాషలో నటించిన కిరాక్ పార్టీ మంచి విజయాన్ని సాధించింది.అంతేకాదు ఆ చిత్రం ఈ అమ్మడిని టాలీవుడ్‌లో అడుగు పెట్టేలా చేసింది.
టాలీవుడ్ ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసింది.కానీ కోలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసిన ఈమెకు అంత పేరు తెచ్చి పెట్టలేదు.
అయితే బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసిన బ్యూటీ అక్కడ కూడా క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది.
దీంతో దక్షిణాదిలో ఎక్కువగా చిత్రాలు చేసే అవకాశం లేకపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన్న నటించిన పుష్పా 2( Pushpa 2 ) త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా ఒక భేటీలో నటి రష్మిక మందన్న పేర్కొంటూ తాను తనను ఇతరులతో పోల్చుకోవడానికి ఇష్టపడనని తెలిపారు.
దీన్ని తెలిపే విధంగా ఇరీప్లేసబుల్ అంటూ తన చేతిపై పచ్చబొట్టును కూడా పొడిపించుకున్నారు.తాను తనలాగే ఉండటానికి ఇష్టపడతానని అన్నారు.అందువల్లే అభిమానులు తనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని నమ్ముతున్నానని అన్నారు.అలాగే సినిమా పరిశ్రమలో పురుషాధిక్యం ఉన్న మాట వాస్తవమే అన్నారు రష్మిక.
ఇప్పుడు ఆ పరిస్థితి కొంచెం కొంచెం మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పుడు ప్రతిభ ఉంటే చాలని అభిమానుల ఆదరణ లభిస్తుందని అన్నారు.తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని, అయితే హిందీ తదితర ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చింది రష్మిక.అందువల్ల తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, కొందరైతే తనను తిట్టుకుంటున్నారని ఆమె అన్నారు.
అయితే అదంతా వారికి తనపై ఉన్న అభిమానమే కారణమని గ్రహించగలనని పేర్కొన్నారు.అదేవిధంగా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదని చాలామంది అడుగుతున్నారని, అలాంటి కథా చిత్రాల్లో నటించాలని ఏ నటి అయినా కోరుకుంటారని, తాను అందుకు అతీతం కాదని అన్నారు.
ఈ సందర్భంగా రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.