భారత సంతతికి చెందిన డాక్టర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా అమెరికా వ్యాప్తంగా బోన్ మ్యారో , స్టెమ్ సెల్ రిజిస్ట్రేషన్‌లను( Bone Marrow, Stem Cells Registrations ) పెంచేందుకు ప్రచారాన్ని ప్రారంభించింది.
నేషనల్ మారో డోనర్ ప్రోగ్రాం (ఎన్‌ఎండీపీ)( National Marrow Donor Program ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో లుకేమియా, లింఫోమా రోగులకు సాయం చేయడానికి భారతీయ అమెరికన్ దాతల సమూహాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంపై ఆంకాలజిస్ట్, ఏఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కత్తుల( Dr Satheesh Kathula ) మాట్లాడుతూ.లుకేమియా,( Leukemia ) లింఫోమా( Lymphoma ) ఉన్న రోగులు జీవించడానికి ఎముక మజ్జ, రక్త మూల కణ మార్పిడి అవసరమన్నారు.క్యాన్సర్ రోగులకు( Cancer Patients ) సరిపోయే దాతలను కనుగొనడం కష్టమన్నారు.
అమెరికాలోని దాదాపు 25 శాతం మంది డాక్టర్లు వలసదారులేనని, వారిలో ఎక్కువ మంది ఇండో అమెరికన్ వైద్యులేనని సతీష్ చెప్పారు.వీరంతా హెల్త్ కేర్, రీసెర్చ్ , బోధన, అడ్మినిస్ట్రేషన్ తదితర రంగాల్లో కీలకమైన స్థానాల్లో ఉన్నారని.
అవసరమైన వారికి సంరక్షణను అందిస్తారని తెలిపారు.
అమెరికాలో డాక్టర్ లైసెన్స్‌ను కోరుకునే విదేశీ వైద్యులపై వివక్షను ఎదుర్కోవడానికి నాలుగు దశాబ్ధాల క్రితం ఏఏపీఐని స్థాపించారు.ఇది అమెరికాలో వైద్యులనే కాకుండా సామాజిక, విద్యా, రాజకీయ, వృత్తిపరమైన సమస్యలను ప్రశ్నించే శక్తివంతమైన సంస్థగా ఎదిగింది.కమ్యూనికేషన్, చట్టం, విద్య సహా పలు మార్గాల్లో భారతీయ అమెరికన్ వైద్యులకు అండగా నిలుస్తామని డాక్టర్ కత్తుల వివరించారు.
ఏఏపీఐ యంగ్ ఫిజిషియన్స్ విభాగం, ఏఏపీఐ మెడికల్ స్టూడెంట్స్, రెసిడెంట్స్, ఫెలోస్ సెక్షన్ ఇండియన్ అమెరికన్ మెడికల్ అండ్ డెంటల్ స్టూడెంట్స్ తదితర విభాగాలు యువతరానికి అండగా నిలుస్తున్నాయి.
కోవిడ్ 19 సమయంలో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలకు మద్ధతుగా 5.2 మిలియన్ల నిధులను సేకరించే కార్యక్రమం ద్వారా డాక్టర్ సతీష్ తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు.ఆరోగ్య సంరక్షణ, విధాన సంస్కరణల కోసం వనరులను సమీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అమెరికా, భారత్‌లలో హెల్త్ కేర్ రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.