ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Directed by Ramgopal Varma )గురించి మనందరికీ తెలిసిందే.వర్మ ప్రస్తుతం వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేనిపోని కాంట్రవర్సీలలో కూడా నిలుస్తూ వస్తున్నారు.
ఇప్పటికి చాలా రకాల కాంట్రవర్సీలలో నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒక దివంగత నటి, స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్( Janhvi Kapoor ) గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాంగోపాల్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.పదహారేళ్ళ వయసు లేదా వసంత కోకిల..
సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది.నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్‌ననే విషయం మర్చిపోయాను.
ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా.అది ఆమె స్థాయి అని ఆయన చెప్పారు.
జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.నాకు శ్రీదేవి అంటే ఇష్టం.
ఆమెను ఎంతో అభిమానిస్తుంటా.ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా.
అలాగే, జాన్వీతోనూ సినిమా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు అని చెప్పుకొచ్చారు రాంగోపాల్ వర్మ.ఈ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే జాన్వీ కపూర్ విషయానికి వస్తే.
బోని కపూర్ ( Boney Kapoor )శ్రీదేవిలకుమార్తెగా జాన్వి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మొదట దడక్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.తర్వాత వరుసగా బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించి మెప్పించింది.
ఇకపోతే చాలామంది జాన్వీ కపూరను చూసి తన తల్లితో పోల్చడంతో ఆ విషయాలఫై స్పందించింది జాన్వీ కపూర్.అమ్మతో నన్ను పోల్చి చూడటం అదృష్టంగా భావిస్తాను.ఆమె వల్లే నాకు ఈ జీవితం లభించింది.ఇంతమంది అభిమానులను సంపాదించా.
ఆమె నాకు ఎప్పటికీ ఆదర్శమే.నా నటనతో అభిమానులను ఎప్పుడూ నిరాశపరచను.
వారంతా నాలో అమ్మను చూసుకుంటున్నారు.అందుకే అమ్మ శ్రీదేవితో పోల్చడం నా బాధ్యతను మరింత పెంచుతుంది అని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్.