తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ , పుష్ప 2 ( Sukumar, Pushpa 2 )సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటున్నాడు.ఇక ఇప్పటికే బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప 2 సినిమా దంగల్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసే దిశగా ముందుకు సాగుతుంది…ఇక ఈ సందర్భంలోనే సుకుమార్ తను తర్వాత రామ్ చరణ్( Ram Charan ) తో చేయబోయే సినిమా మీద భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపధ్యం లో తెరకెక్కించే ప్రయత్నాల్లో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఆయన చెబుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే( entire Indian film industry ) ఈ సినిమా 2500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుంది అంటూ ఆయన పూర్తి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ( game changer movie )ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.తద్వారా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసి పెడుతుందని రామ్ చరణ్ అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన సుకుమార్ ఈ సినిమా మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసి యావత్ ఇండియన్ అభిమానులంతా ఎంజాయ్ చేస్తారు అంటూ శంకర్ కూడా ఈ సినిమా మీద చాలా హైప్ అయితే పెంచే ప్రయత్నం చేశాడు.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా ఎలాంటి స్టార్ డమ్ ను సంపాదించుకుంటాడనేది తెలియాల్సి ఉంది…
.