ప్రస్తుత కాలంలో ఒక సినిమా థియేటర్లలో 100 రోజులు ఆడటం గగనమైపోయింది.సినిమా ఎంత పెద్ద హిట్టైనా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి కనిపించడం లేదు.
అయితే దేవర( Devara ) మాత్రం 6 థియేటర్లలో 100 రోజులు ఆడి సత్తా చాటింది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.ఈస్ట్ గోదావరి జిల్లాలోని మల్కిపురంలో ఉన్న పద్మజ కాంప్లెక్స్( Padmaja Complex ), మండపేటలో ఉన్న రాజరత్న కాంప్లెక్స్( Rajaratna Complex ) లలో ఈ సినిమా 100 రోజులు ఆడింది.
చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో సైతం దేవర 100 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం.ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే బి.కొత్తకోటలో ఉన్న ద్వారకా పిక్చర్స్ ప్యాలేస్( Dwarka Pictures Palace ), కల్లూరులోని ఎం.ఎన్.ఆర్ థియేటర్, రొంపిచర్లలోని ఎం.ఎం.డీలక్స్ థియేటర్ లో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం.
దేవర 100 రోజుల థియేటర్ల లెక్క గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.అయితే ఏపీలో మాత్రమే ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడింది.ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉండగా ఓటీటీలో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.
దేవర సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది.
దేవర బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాల్సి ఉంది.బుల్లితెరపై కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.