పవన్ చదువును మధ్యలో ఆపేయడానికి అసలు కారణమిదా.. అసలేమైందంటే?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ఒకవైపు డిప్యూటీ సీఎం గా( Deputy CM ) బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు హీరోగా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.

 Why Pawan Kalyan Stopped Studies In The Middle Reason Details, Pawan Kalyan, Tol-TeluguStop.com

కాగా పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్( Intermediate ) వరకు చదువుకొని ఆ తర్వాత చదువు మానేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత మళ్లీ ఓపెన్ లో కూడా డిగ్రీ వంటివి కట్టుకోలేదు.

అలాంటి ఆలోచన కూడా చేయలేదు.చాలామంది కొన్ని పరిస్థితుల వల్ల ఓపెన్ వర్సిటీల విధానంలో డిగ్రీలు పీజీలు కూడా చేశారు.

పవన్ కల్యాణ్ అలాంటి ఆలోచన కూడా చేయలేదు.కానీ పుస్తకాలు చదవడం తనకు గొప్ప ఆసక్తి అని, వేలకొద్దీ పుస్తకాలు చదివినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు.

Telugu Deputycm, Intermediate, Pawan Kalyan, Tollywood, Vijayawada-Movie

అదంతా ఓకే గానీ తాను ఇంటర్మీడియట్ తో చదువు ఎందుకు ఆపేశానో ఆయన చాలా గొప్ప రీజనింగ్ చెప్పుకున్నారు.తాను కోరుకుంటున్న చదువు క్లాసు పుస్తకాల్లో లేదని, అందుకే చదువు మానేశానని అంటున్నారు.విజయవాడలో( Vijayawada ) పుస్తక మహోత్సవం ప్రారంభం అయింది.ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ అతిథిగా హాజరయ్యారు.పుస్తకాలు చదవడం అంటే తనకున్న ప్రేమను తన ప్రసంగంలో బయటపెట్టారు.ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తానని, అంతే తప్ప తన దగ్గరున్న పుస్తకాలు మాత్రం ఇవ్వనని, కోటి రూపాయలైనా ఇస్తాను గానీ పుస్తకాలు ఇవ్వనని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Deputycm, Intermediate, Pawan Kalyan, Tollywood, Vijayawada-Movie

అదంతా పక్కన పెడితే ఇంటర్ తో ఆపేయడానికి చెప్పిన రీజనింగే తమాషా! ఉంది అని చెప్పాలి.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.నేను చదువుకోలేక కాదు.మార్కులు తెచ్చుకోలేక కాదు.బాగా చదివేవాడిని.నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు.

క్లాస్ రూంలో లేదు.అందుకే మానేశా అని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు.

తాను కోరుకుంటున్నది క్లాసు పుస్తకాల్లో లేదని పదిహేడేళ్ల ప్రాయంలోనే అర్థం చేసుకోవడం.ఆ తర్వాత సినిమా రంగ ఎంట్రీ ఇవ్వడం బహుశా కోరుకున్న దాని కోసమేనా అని జనం నవ్వుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.పవన్ కళ్యాణ్ చేసిన మాటలు విద్య రంగాన్ని అదేవిధంగా విద్య వ్యవస్థను అవమానించే విధంగా ఉన్నాయి అంటూ పలువురు మండిపడుతున్నారు.

ఒక మంచి స్థానంలో ఉంటూ ఇలా విద్యావ్యవస్థను అపహాస్యం చేసే విధంగా విద్యార్థులను యువతరాన్ని చదువుల పట్ల విముఖత పెంచేలా తప్పుదారి పట్టించేలా మాట్లాడడం చాలా దారుణం అంటూ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube