ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, మధ్యపానం, ధూమపానం తదితర కారణాల వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోతూ ఉంటాయి.ఈ మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండటం ఎంతో అవసరం.
లేకుంటే వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.అయితే బాడీని క్లీన్ గా మరియు హెల్తీగా ఉంచడానికి ఇప్పుడు చెప్పబోయే డిటాక్స్ జ్యూస్ ( Detox juice )ది బెస్ట్ అనొచ్చు.
ఈ జ్యూస్ ను వారంలో కేవలం మూడు సార్లు తీసుకుంటే శరీరంలో మలినాలు తొలగిపోవడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అది అందించే లాభాలు ఏంటి.? అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్రీన్ యాపిల్ ( Green apple )ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కివీ పండు( Kiwi fruit )ను తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేయాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ ఆపిల్ ముక్కలు, కివీ పండు స్లైసెస్ ను వేసుకోవాలి.అలాగే నాలుగు జీడిపప్పులు, ఆరు నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం, ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు తేనెను కలుపుకుని సేవించాలి.ఈ గ్రీన్ యాపిల్ కివీ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి.అలాగే ఈ జ్యూస్ ను తరచూ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు మెదడు పనితీరు సైతం ఎంతో చురుగ్గా పనిచేస్తుంది.కాబట్టి బాడీని క్లీన్ చేసి హెల్తీగా మార్చే ఈ గ్రీన్ యాపిల్ కివీ జ్యూస్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.