సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె సిటాడెల్(Sitaadel) సిరీస్ లో బిజీగా ఉండగా, మరోవైపు ఖుషి(Kushi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా(Shaakunthalam Movie) ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా సమంత నటించాల్సిన ప్రాజెక్ట్ ఒక్కసారిగా సమంత చేతులు మీదుగా జారిపోయి నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) చేతిలో పడిన విషయం మనకు తెలిసిందే.
రష్మిక సైతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే తొలిసారిగా ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు.
ఈ సినిమాకు రెయిన్ బో(Rainbow)అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
నిజానికి ఈ ప్రాజెక్టులో సమంత నటించిన చివరిలో సమంత స్థానంలో రష్మికను ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈ సినిమాకు శాంతరూబెన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా డ్రీమ్స్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.ఇక ఇందులో రష్మికకు జోడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు.
మొదట సమంతను అనౌన్స్ చేసిన మేకర్స్ అనంతరం ఈ ప్రాజెక్టు రష్మిక చేతిలోకి వెళ్లడంతో సమంత అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదే విషయాన్ని నిర్మాతను ప్రశ్నించగా ఈయన చెప్పినటువంటి సమాధానం సమంత అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది.
ఈ విషయం గురించి నిర్మాత మాట్లాడుతూ.స్క్రిప్ట్ కు ఎవరు సరిపోతారో వారిని ఎంపిక చేసుకుంటాము.ఆ ఫ్లోను మేము మార్చాలని అనుకోవడం లేదు.కంటెంట్.కర్మ అలా జరుగుతూ వెళుతుంటాయి ఎవరు వాటిని మార్చలేరు అంటూ నిర్మాత ప్రభు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ముందుగా ఈ ప్రాజెక్టు కోసం సమంతను అనౌన్స్ చేసి ఇప్పుడు రష్మికను తీసుకోవడమే కాకుండా కర్మను ఎవరు మార్చలేరు అంటూ ఈయన కామెంట్లు చేయడంతో సమంత అభిమానులు నిర్మాతపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మరి ఈయన ఏ ఉద్దేశంతో సమంత గురించి ఇలా అన్నారో తెలియదు కానీ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.