ఆడవేషాలు వేసి అక్కినేని ఎంత డబ్బు సంపాదించేవారో తెలుసా ?

తెలుగు సినిమా దిన దిన అభివ్రుద్ధి చెందడంలో ఇద్దరు మహానటుల పాత్ర మరువలేనిది.వారిలో ఒకరు విశ్వ నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కాగా.

 Akkineni Nageswarao Early Days Struggles Details, Anr, Akkineni Nagewsara Rao, T-TeluguStop.com

మరొకరు అక్కినేని నాగేశ్వర్ రావు.అక్కినేని ఏడున్నర దశాబ్దాల పాటు సినిమా రంగంలో కొనసాగారు.

తొలితరం తెలుగు సూపర్ స్టార్స్ లో అక్కినేని టాప్ లో ఉంటారు.పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించాడు.

ఎన్నో అద్భుత సినిమాల్లో చక్కటి పాత్రలు పోషించాడు.దిగ్గజ నటుడిగా గుర్తింపు పొందాడు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటుడు అక్కినేని.ఒకానొక సమయంలో ఆయన గురించి ఎన్నో విషయాలు రాసుకున్నాడు.

ఇంతకీ తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

నేను పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాడిని.

ఎక్కువ చదువుకోలేదు.సంస్కారం గురించి పెద్దగా తెలియదు.

పెద్దలు కనిపిస్తే కనీసం నమస్కారం చెప్పాలనే విషయం కూడా తెలియదు.అలాంటి తనను సినిమా పరిశ్రమ తీర్చిదిద్దింది.

ఒక మనిషిగా తయారు చేసింది అంటాడు నాగేశ్వర్ రావు.ఓ గొప్ప నటుడు తన గురించి తాను ఇలా చెప్పుకోవాలంటే గట్స్ కావాలి.అలాంటి గట్స్ ఏఎన్నార్ కు ఉన్నాయనే చెప్పుకోవచ్చు.

అక్కినేని చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు.

Telugu Senior Ntr, Telugu Fim, Tollywood-Telugu Stop Exclusive Top Stories

పేద కుటుంబంలో పుట్టిన ఆయన ఎన్నో కష్టాలను చవి చూశాడు.ఇబ్బందుల నుంచి ఎలా బయటకు రావాలా? అని నిత్యం ఆలోచించే వాడు.పశువుల కొట్టంలో పని చేసేవాడు.పేడతీసి, పాలు పిండే వాడు.వచ్చిన డబ్బును ఇంటి ఖర్చులకు ఇచ్చేవాడు.తన సొంతూరు గుడివాడ సమీపంలోని వెంకటరామాపురంలో ఎక్కువగా నాటకాలు వేసేవాడు.

హరిశ్చంద నాటకంలో నారదుడి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టం.తను చదువుకునే స్కూల్లో ఓసారి నాటకాలు వేశారు.

Telugu Senior Ntr, Telugu Fim, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అందులో సత్య హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతిగా ఆడవేషం కట్టాడు.ఆ నాటకం అందరికీ బాగా నచ్చింది.దాంతో ఆయనకు అప్పటి నుంచి ఆడ వేశాలే ఇచ్చేవారు.అలా వచ్చిన అవకాశాలు వినియోగించుకున్నాడు.ఆడవేశం కట్టి డబ్బులు సంపాదించేవాడు.ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube