Silky Hair : సిల్కీ హెయిర్ కోసం ఆరాటపడే వారికి ఉత్తమ హోమ్ రెమెడీ.. తప్పక ట్రై చేయండి!

సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది సిల్కీ హెయిర్( Silky Hair ) కోసం ఆరాటపడుతూ ఉంటారు.

ఎందుకంటే సిల్కీ హెయిన్ మ‌న లుక్ ను మ‌రింత మెరుగ్గా మారుస్తుంది.

ఈ క్రమంలోనే కొందరు సిల్కీ హెయిర్ కోసం హీటింగ్ టూల్స్( Heating Tools ) ను వాడతారు.కానీ అటువంటి ఉత్పత్తులను తరచూ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

హెయిర్ డ్యామేజ్ అధికం అవుతుంది.అందుకే సహజ పద్ధతిలో సిల్కీ హెయిర్ ను పొందడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ( Home Remedy ) అందుకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే సహజంగానే సిల్కీ మరియు షైనీ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి వాటర్ తో రెండు సార్లు కడగాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ), బాగా పండిన ఒక అరటి పండ్లు, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా? 
యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   

వారానికి ఒక్క‌సారి ఈ హెయిర్ ప్యాక్( Hair Pack ) వేసుకోవ‌డం వ‌ల్ల అద్భుత ఫలితాలు పొందుతారు.అవిసె గింజ‌లు, ఓట్స్‌, అర‌టి పండు, ఆలివ్ ఆయిల్ లో విటమిన్లు మరియు కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి.ఇవి జుట్టును సిల్కీ గా మారుస్తాయి.

Advertisement

మృదువుగా మెరిసేలా ప్రోత్స‌హిస్తాయి.అలాగే వారానికి ఒక‌సారి ఈ రెమెడీని పాటించ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

డ్రై హెయిర్ స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

తాజా వార్తలు